స్టీఫెన్
హాకింగ్ జీవితం సంక్షిప్త పరిచయం. అది నేటి యువతకు ఆదర్శం.. !
"""""""""""""""""""""""""""""""""""""""""""""""
(నేడు
మార్చ్ 14, ఆయన వర్ధంతి)
1) మొదటి
భాగం:-
"అర్థమయ్యేట్లు
చెప్పాలంటే అసలు దేవుడు లేడు. ఈ విశ్వాన్ని ఎవరూ సృష్టించలేదు. నేను ప్రగాఢంగా
విశ్వసించేదేమంటే, స్వర్గ నరకాలు లేవు. మరణానంతర జీవితం కూడా లేదు. అద్భుతమైన ఈ విశ్వ
రహస్యాల్ని తెలుసుకోవాలంటే మనకు ఉన్నది ఒక్క జీవితం మాత్రమే.."
అని అంత
బలంగా చెప్పిన డాక్టర్ స్టీఫెన్ హాకింగ్‌కు ఆ ఒక్క జీవితం కూడా ఎంతో దారుణంగా
గడపాల్సి వచ్చిందని చాలా మందికి తెలిసి వుండకపోవచ్చు. ఆయన తన గురించి ఇంకా ఇలా
చెప్పుకున్నారు..
"నా శరీరం
నిస్సత్తువగా కుర్చీలో కూలబడి పోవచ్చు. కానీ, నా మెదడు
విశ్వాంతరాళాల్ని శోధిస్తుంది.."
అని ఎంతో
ఆత్మ విశ్వాసం వ్యక్తంచేశారు విశ్వ విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త హాకింగ్..
బాల్యం:
1942 జనవరి 8న
ఇంగ్లండులోని ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించిన హాకింగ్ ముప్ఫయ్యేళ్లు కేంబ్రిడ్జి
విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేసి, పదవీ
విరమణ చేశారు.
హాకింగ్
తల్లి బ్రిటీష్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలు. అందువల్ల స్టీఫెన్‌కు చిన్నప్పటి
నుండి ప్రగతిశీల భావాలు అబ్బాయి.
తండ్రి
ఫ్రాంక్ మెడికల్ డాక్టరు, పరిశోధకుడు. విద్యార్థి దశలో పరిచయమైన జేన్ వైల్డ్‌తో పరిచయం
ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతనికి మోటార్ న్యూరోసిస్ వ్యాధి
సోకింది.
ఫైనల్
ఇయర్‌లో ఉండగా స్టీఫెన్‌లో ఎ.ఎల్.ఎస్. వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఇది ఒక
"మోటార్ న్యూరాన్" వ్యాధి..
ఈ వ్యాధి
బయట పడినప్పుడు ఆయన కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే బతకగలడని డాక్టర్లు చెప్పారు.
అంటే ఆయన తన 23వ యేట చనిపోవాల్సింది. కానీ తను ఈరోజు చనిపోయే నాటికి, అంటే
ఇప్పుడాయన వయసు 76 సంవత్సరాలు.
బ్లాక్
హోల్స్‌పై పరిశీలనలు చేస్తున్న సమయంలోనే 1965లో గాన్‌విల్లి
కైస్ కాలేజివారి ఫెలోషిప్ దొరికింది. దాంతో అప్లయిడ్ మాథమెటిక్స్, థియరటికల్
ఫిజిక్స్-కాస్మోలజీలో పిహెచ్‌డి తీసుకున్న స్టీఫెన్, మొదట్లో
క్లచస్ ఉపయోగిస్తూ మెల్లగా నడిచేవారు.
హాకింగ్
తన శారీరక లోపాల గురించి ఎవరితోనూ ఎక్కువగా చర్చించేవారు కాదు. విధి రాత, దైవం
వంటి వాటిని నమ్మేవారు కాదు, కాబట్టి వాస్తవ స్థితి
ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధపడేవారు.
తన వైకల్యానికి
సానుభూతి ప్రకటిస్తూ సహాయ పడడానికి వచ్చే వారిని సున్నితంగా వారించేవారు.
ఆయన తనను
మొదట సైంటిస్ట్‌గా గుర్తించాలనుకునే వారు. తరువాత పాపులర్ సైన్స్ రచయితగా, ఆ తరువాత
కొన్ని ఆలోచనలతో, భావాలతో, ఆశలతో, కోర్కెలతో ఉన్న ఒక మామూలు మనిషిగా గుర్తించాలని కోరుకునే వారు.
'ఆయనది
గొప్ప ధ్యేయమని' కొందరంటే., కాదు ఆయనది పిచ్చి పట్టుదల' అని మరి
కొందరనే వారు..
భౌతిక
శాస్త్రవేత్త వెర్నర్ ఇస్రయిల్ 'మోజట్
కంపోజింగ్ సింఫనీ' తెచ్చి స్టీఫెన్ తలకు అమర్చాడు. దాని వల్ల ఆయనకు తనను తాను
వ్యక్తీకరించుకునే అవకాశం కలిగింది..
దాన్ని
అభ్యసించడానికి ఆయనకు కొంత సమయం పట్టినా, తర్వాత
కాలంలో అది ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది. 1970 నాటికి
మాట పూర్తిగా పడిపోయింది. అతని హావభావాలు కుటుంబ సభ్యులకు, అతి
సన్నిహితులకు మాత్రమే అర్థమయ్యేవి.
1985లో ఆయనకు
నిమోనియా పట్టుకుంది. తీవ్ర అస్వస్థత ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితంగా
ట్రాఖియోటొమి వచ్చింది. దాంతో ఇరవై నాలుగు గంటలూ వైద్య పర్యవేక్షణలోనే ఉండేవారు..
ఆ దశలో
అమెరికన్ ఫౌండేషన్ ముందుకొచ్చి ఖర్చు భరించింది. మూడు షిఫ్టుల్లో నర్సుల్ని
ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. కంప్యూటర్ ఇంజనీర్ డేవిడ్, ఒక చిన్న
కంప్యూటర్‌ని స్టీఫెన్ హాకింగ్ వీల్‌ఛైర్‌కు అమర్చాడు. అందులోని సింథసైజర్ విషయాన్ని
మాటగా మార్చి ఎదుటి వారికి వినిపిస్తుంది. అందుకోసం తన గొంతునే వాడమన్నాడు
స్టీఫెన్. మాట పడిపోక ముందున్న తన గొంతు ధ్వనిని అందులో ఉపయోగించమన్నాడు. దాని
వల్ల స్టీఫెన్ హాకింగ్ సాంకేతిక సంభాషణ సహజ సంభాషణలా మారిపోయేది.
స్పెల్లింగ్
కార్డ్ మీద అక్షరాల్ని ఎంపిక చేసుకోవడానికి మొదట ఆయన తన కనుబొమలు కదిలించేవారు.
తర్వాత 1986లో 'ఈక్వలైజర్' కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా అమర్చిన సాఫ్ట్‌వేర్ వల్ల 2,500-3,000 వరకు
అక్షరాలు, పదాలు, వాడుక మాటలు అన్నీ ఒక చిన్న మీట నొక్కితే అందుబాటులోకి వచ్చే విధంగా
ఉండేవి. నిమిషానికి పదిహేను పదాలు టైపు చేయగల సామర్థ్యం ఆ సాఫ్ట్‌వేర్‌కి ఉండడం
వల్ల, ఆయన ఉపన్యాసాలు, వ్యాసాలు, రచనలు
అన్నీ తయారవుతూ ఉండేవి. ఉపన్యసించాల్సిన చోట ఆ విషయాల్ని ముందుగానే స్పీచ్
సింథసైజర్‌కు పంపి సిద్ధంగా ఉంచుకొనేవారు. దీంతో అక్కడ ఆయనే స్వయంగా
మాట్లాడుతున్నట్లు ఉండేది.
స్టీఫెన్
హాకింగ్ కేవలం మనిషి ఆత్మ విశ్వాసాన్ని నమ్మిన శాస్త్రవేత్త. మేధావి. ఆయనను
కాపాడు కోవడానికి కుటుంబమే కాదు సమాజమే కదిలి వచ్చింది. మనిషి కోసం మనుషులు కదిలి
వచ్చి నట్టయ్యింది.
అంతటి
దయనీయ స్థితిలో కూడా ఆయన దేవుణ్ణి తలవలేదు. ముడుపులు కట్టలేదు.
పైగా..
"వైజ్ఞానిక
శాస్త్ర పరిశోధనల్లో దేవుడి ప్రమేయమే లేదు" అని చాటి చెప్పారు. మనిషి
చేస్తున్న ఆవిష్కరణలు, సాధిస్తున్న విజయాలను, 'లేని
దేవుడి' ఖాతాలో వేస్తూ బతికే పలాయన వాదులున్నంత కాలం మార్పు రాదు. ఈ విషయం
చెప్పడానికే స్టీఫెన్ హాకింగ్ శారీరక బలహీనత గూర్చి, ఆయన
అచంచల ఆత్మ విశ్వాసం గూర్చి ఇక్కడ వివరించాను..
2005లో ఆయన
తన పరికరం వాడడానికి చెంప కండరాలు కదిలించేవాడు. నిమిషానికి అది ఒక పదం మాత్రమే
తీసుకునేది. అది ఇబ్బందిగా అనిపించడం వల్ల ఇన్‌టెల్ పరిశోధకుల సహకారంతో లండన్‌లోని
షిఫ్ట్ కీ కంపెనీ ముందుకొచ్చింది. అంతకు ముందు స్టీఫెన్ హాకింగ్ రాసిన పరిశోధనా
పత్రాల్లోని పదాల్ని, వాక్యాల్ని, విషయాల్ని తరచుగా వాడే వాడుక మాటల్ని అది గుర్తుపెట్టుకొని టైప్
చేసేది. ఈ పద్ధతి మనం రోజూ వాడే స్మార్ట్ ఫోన్‌లలో
కూడా చూస్తున్నాం..
2009 నాటికి
ఆయన తన వీల్ ఛైర్‌ను నడుపుకోలేని స్థితి వచ్చింది. మళ్లీ హాస్పిటల్లో కూడా
చేరాల్సి వచ్చింది. అలాంటి స్థితిలో కూడా ఆయన మానవ జాతి గురించే ఆలోచించారు.,
"రాజకీయంగా, సామాజికంగా, పర్యావరణ
పరంగా ధ్వంసమౌతున్న ఈ సమాజంలో మానవజాతి మరో వందేళ్లు కొనసాగేదెట్లా ?"
అని బెంగ
పెట్టుకున్నారు..
యవ్వన
దశలోనే వైద్యపరమైన శారీరక సమస్యలకు గురైన స్టీఫెన్, తన
జీవితంలో నిశ్శబ్దంగా అనేక పోరాటాలు చేస్తూ వచ్చారు..
నిస్సత్తువగా
మారిన తన శరీరంతో తాను పోరాడుతూ, జ్ఞాన కాంక్ష కోసం పోరాడుతూ, డెబ్భై
ఆరెేళ్ల వయసులో కూడా అచంచల ఆత్మవిశ్వాసంతో ఒక జ్ఞాన శిఖరంగా నిలబడడం ఆయన ప్రత్యేకత
!
మెదడు
ఒక్కటి తప్ప మిగతా శరీరమంతా కుప్పకూలి ఉన్న హాకింగ్, తన
ధ్యేయాన్ని క్షణ కాలమైనా మరువ లేదు. విశ్వ విజ్ఞానానికి తన వంతుగా కొత్త విషయాలను
అందిస్తూనే వచ్చారు. మృత్యువు అంచుమీద శ్వాసిస్తూ కూడా, మనిషి
విజయ పరంపర గూర్చి మాత్రమే ఆలోచించారు డా|| స్టీఫెన్
హాకింగ్..
ఒక రకంగా
చెప్పాలంటే ఆరోగ్యంగా కనిపిస్తున్న దుర్భలులైన కోట్లాది జనం కంటే హాకింగ్ దృఢ
ఖచ్చితంగా సంకల్పుడు. మానసిక బలశాలి. ఆయన ఆకాశమే హద్దు అనుకోలేదు. ఆ ఆకాశాన్ని
కూడా ఇంకొంచెం పైకి ఎదగమని, విసరకనే సవాల్ విసిరారు !
ప్రజా
శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణం శాస్త్ర ప్రపంచానికే కాకుండా ప్రజా సైన్సు
ఉద్యమాలకు తీరనిలోటు.
2) రెండవ
భాగం:-
కనీసం
కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్ఛీకి అతుక్కు పోయిన మనిషి, కనీసం
మాట్లాడటానికీ కంప్యూటర్ సహాయం...
ఇవి
ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ను గుర్తించడానికి
ఆనవాళ్లు.
మోటార్
న్యూరాన్ /న్యూరోసిస్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా... చేస్తున్న పనికి శరీరం
సహకరించక పోయినా...
కృష్ణ
బిలాల పై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి.
శాస్త్ర
వేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని
విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువత ఆయన జీవితం ఒక గొప్ప ఆదర్శం.
స్టీఫెన్
హాకింగ్ ఓ సైద్డాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత
శాస్త్ర ఆచార్యునిగా సేవలందించారు.
2009లో ఆ
పోస్టు నుంచి వైదొలగారు. ప్రస్తుతం మనం హాకింగ్స్ రేడియేషన్ గా పిలుస్తున్న కృష్ణ
బిలాల రేడియేషన్ ను ప్రతిపాదించింది స్టీఫెన్ హాకింగే.
జీవిత
ఘట్టాలు:
అప్పటికి
ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త గెలిలియో మరణించి దాదాపు 300 సంవత్సరాలు
అవుతోంది.
అప్పుడే..
అంటే 1942 జనవరి 8వ తేదీన
ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు.
ఆయన
తండ్రి వృత్తి రీత్యా లండన్ లో వైద్య శాస్త్ర పరిశోధకుడు.
రెండవ
ప్రపంచ యుద్ధ సమయంలో లండన్ లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల వల్ల స్టీఫెన్ తల్లిని
ఆక్స్ ఫర్డ్ లోని సురక్షిత ప్రాంతానికి పంపించారు.
కొంత
కాలానికి ఆయన కుటుంబం లండన్ లోని హైగేట్స్ ప్రాంతానికి తరలివచ్చింది.
స్టీఫెన్
తన విద్యార్థి జీవితాన్ని అక్కడే ప్రారంభించాడు.
తర్వాత
అంటే 1950లో ఆయన తండ్రి కుటుంబాన్ని మిల్ హిల్ ప్రాంతానికి మార్చాడు.
తండ్రి
స్టీఫెన్ ని అక్కడి సెయింట్ ఆల్బన్స్ పాఠశాలలో చేర్చాడు.
తన గణిత
ఉపాధ్యాయుని ప్రేరణతో గణితశాస్త్రంలో స్పెషలైజేషన్ చేద్దామని అనుకున్నాడు
స్టీఫెన్.
కాని
దానికి వ్యతిరేకంగా తండ్రిరసాయనశాస్త్రంలోచేర్పించాడు.
తరువాత 1959లో
నేచురల్ సైన్స్ విద్య కోసం స్కాలర్ షిప్ పరీక్ష రాశాడు. అందులో సఫలీకృతుడు
కాగలిగినా...
భౌతిక
శాస్త్రంలో స్పెషలైజేషన్ చేశాడు స్టీఫెన్. 1962లో కేవలం
ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు కాగలిగాడు.
కాస్మాలజి, జనరల్
రిలెటివిటీ పరిశోధనల కోసం ఆక్స్‌ఫర్డ్ కి వెళ్ళాడు. అప్పటి నుంచి స్టీఫెన్
పరిస్థితి పూర్తిగా మారింది. అన్నం తినాలన్నా...
కనీసం
బూట్ల లేసు కట్టుకుందామన్నా... స్టీఫెన్ శరీరం సహకరించేది కాదు.
క్రిస్‌మస్సెలవులకు
ఇంటికి వెళ్ళిన స్టీఫెన్ పరిస్థితి, ఆయన
తల్లిదండ్రులను కలవర పెట్టింది. భోజనం చేయడానికి ఆయన పడుతున్న ఇబ్బంది... తల్లిని
మధనపెట్టింది.
ఆ
సమయంలోనే ఆసుపత్రిలో చేసిన పరీక్షల్లో ఆయనకు "మోటార్ న్యూరాన్" (Motor Neuron
Disease) అనే భయంకర వ్యాధి ఉన్నట్టు తెలిసింది.
దీనినే Amyotrophic
Lateral Sclerosis (ALS) వ్యాధి అని కూడా అంటారు.
నాడీ
మండలంపై అంటే నరాలు, వెన్నుపూసపై ఇది ప్రభావం చూపుతుంది.
డాక్టరేట్
సంపాదించేలోపే స్టీఫెన్ మరణిస్తాడని అనుకున్నారంతా...
కానీ ఆయన
పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది.
మళ్లీ
విశ్వ విద్యాలయానికి తిరిగివచ్చిన హాకింగ్ తన పరిశోధనల్లో నిమగ్నం అయ్యాడు.
ఆయన
ఆరోగ్య పరిస్థితి తెలిసి మిత్రులు సహకరించాలని చూసినా స్టీఫెన్ సున్నితంగా
తిరస్కరించే వాడు..
విశ్వ
విద్యాలయం:
స్టీఫెన్
తన 17 వ యేట,1959వ సంవత్సరం 10వ నెలలో
ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరినాడు.
వైవాహిక
జీవితం:
విశ్వ
విద్యాలయంలో తనకు పరిచయమున్న మహిళను స్టీఫెన్ వివాహం చేసుకున్నాడు. ఆక్స్ ఫర్డ్ లో
ఉన్నప్పుడు దగ్గర లోనే ఇల్లు తీసుకుని ఉండేవాడు.
స్టీఫెన్
కు వ్యాధి బాగా ముదిరిన తరువాత విడాకులు తీసుకున్నాడు.
అప్పటికే
వారి వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు మగ పిల్లలు, ఒక
ఆడపిల్ల కలిగారు.
విడాకుల
అనంతరం హాస్పటల్లో తనకు సేవలు చేస్తున్న ఓ నర్స్ తో స్టీఫెన్ సహజీవనం
ప్రారంభించాడు.
పరిశోధనలు,
ఆవిష్కరణలు,
అభిప్రాయాలు:
ఎన్నో
విశ్వ విద్యాలయాల్లో పనిచేసిన స్టీఫెన్ కు, వ్యాధిఅడ్డంకిగా
మారలేదు.
తన నాడీ
మండలం పూర్తిగా పాడవుతున్నా... మెదడు సహకరించడాన్ని స్టీఫెన్ గమనించాడు.
1970 నుంచి
కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించాడు. తీరికలేని స్టీఫెన్ తనకు వ్యాధి
వుందన్నవిషయాన్ని కూడా మరచి పోయాడు.
క్వాంటం
థియరి, జనరల్ రిలెటివిటీ లను ఉపయోగించి... కృష్ణబిలాలు కూడా రేడియేషన్ను
వెలువరిస్తాయని కనుగొన్నాడు.
1971నుంచి
బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో
విషయాలను ఆవిష్కరించాడు.
1984లోఏ
బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ పుస్తక రచన ప్రారంభించాడు.
ఆ
సమయంలోనే వ్యాధి వల్ల 1985లో వైద్యులదగ్గర ఉండాల్సి వచ్చింది.
అప్పుడే
కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నాడు.
దాని
సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించాడు.
అది
అమ్మకాల్లో సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదు.
ప్రపంచవ్యాప్తంగా
40
భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులోనూ...
కాలం
కథపేరుతో వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగాఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ అమ్మకాల్లో
సృష్టించిన రికార్డు వల్ల అది 1998 అంటే వెలువడిన 10 సంవత్సరాల
తరువాత గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించింది.
"మరణం
తర్వాత జీవితం లేదు. స్వర్గం, నరకం అనేవి కట్టు కథలు.
మరణం
తర్వాత జీవితం, స్వర్గం, నరకం వంటివేమీ లేవు.
ఇవన్నీ
మృత్యువు అంటే భయపడేవారి కోసం అల్లిన కట్టు కథలు.
మనిషిమెదడుకూడా
కంప్యూటర్ వంటిదే.
విడిభాగాలు
పాడైన తర్వాతకంప్యూటర్‌పని చేయటం ఆగిపోయి నట్టే మెదడు కూడా ఆగిపోతుంది.
ఒక్కసారి
మెదడు నిలిచిపోయిన తర్వాత ఇక ఏమీ ఉండదు.
కన్నుమూసేలోపే
మనకున్న శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ మంచి జీవితం గడపాలి.
మనం చేసే
పనులు అత్యున్నతంగా ఉండటానికి కృషి చేయాలి.
49 ఏళ్లుగా
మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉంటోంది.
అయినప్పటికీ
నేను మృత్యువుకు భయపడటం లేదు.
అలాగని
త్వరగా మరణించాలని కూడా నేను భావించటం లేదు.
నేను
కన్నుమూసేలోపు చేయాల్సిన పనులు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి.."