నేను ప్రశ్నిస్తా ,మరలా మరలా ప్రశ్నిస్తా ! ---(ఐ సపోర్ట్ గౌరీ లంకేష్ )
నీ “మత” ఆచారం చెబుతుంది భర్త చని పొతే స్త్రీని సతీ సహగమనం(అంటే భర్త
చితిపైనే బ్రతికున్న ఆమెను కూడా పడుకోబెట్టి కాల్చి చంపమని ). నీ “మత” ఆచారం చెబుతుంది చెపుతుంది భర్త చని పోయిన స్త్రీని గుండు గీఇంచి
మూలన కూర్చుండ బెట్టమని.
నీ
మతం చెపుతుంది భర్త చనిపొఇన స్త్రీని చచ్చేంత వరకు పునర్వివాహం చేసుకొనకుండా
చచ్చేంత వరకు విధవగానే వుండాలని. నీ “మతం” చెబుతుంది
భర్త చనిపొఇన స్త్రీ ముఖం చూస్తే ఆశుభమని, అరిష్టమని.నీ మతం చెబుతుంది విధవరాలు శుభకార్యాలలో పాల్గొనటానికి
అనర్హురాలని .
నీ “మతం” చెబుతుంది మహిళ బహిస్ట్ ఐతే ఆమె మైల పడ్డదని ,ఆమెకు ఆ సమయంలో ఆలయాలలోకి ప్రవేశించే
అర్హత లేదు అని . నీ “మతం” చెబుతుంది స్త్రీ కన్యగా వున్నపుడు
తండ్రి మీద ,యవ్వనంలో వున్నపుడు భర్త మీద ,ముసలి తనంలో కుమారుడి మీద మాత్రమే
ఆధారపడి
"బానిసలాగా" మాత్రమే స్త్రీ జీవించాలిగాని,స్వతంత్రంగా జీవించే హక్కు ఆమెకు
ఎప్పటికి లేదని.
నీ
మతం చెపుతుంది సాటి మనిషి చని పొతే ముట్టుకున్నా లేదా కనీసం చూసినా మైల పడతారని. నీ “మతం” చెబుతుంది కుక్కను దేవుడి అవతారంగాను ,వేప చెట్టును ధనాన్ని ఇచ్చే దేవతగాను ,ఎలుకను దేవుడి వాహనంగాను,విష సర్పమైన పామును నాగదేవతగాను ,కుళ్ళిన జంతువుల కళేబరాలను తినే
గ్రద్దను దేవుడి వాహనంగాను , చివరికి
మలము తినే పందిని కూడా దేవుడిగాను పూజించమని, కాని ఆశ్చర్యంగా అదే.....
నీ “మతం” చెపుతుంది దేవుడు మనుషులను మాత్రం నాలుగు వర్ణాలుగా పుట్టించ్చాడు
అని , అందులో మొదటి వర్ణం వారు దేవుని మొఖము
నుండి పుట్టారు అని , రెండవ
వర్ణం వారు దేవుని భుజాలనుంది పుట్టారు అని ,మూడవ వర్ణం వారు దేవుడి తొడలనుండి పుట్టారు అని ,ఇక నాలుగవ వర్ణం వారు దేవుని యొక్క
పాదాలనుండి పుట్టారు అని , అదే నీ మతం
చెబుతుంది వారిలో నాలుగో వర్ణం వారు పై వర్ణాల వారికంటే తక్కువ వారు అని ,వారు పై వర్ణాల వారికి బానిసలు అని ,అదే నీ మతం చెబుతుంది వారికి దేవాలయ
ప్రవేశం నిషిద్దమని అలాగే వేద చదువు నిషిద్దమని , వారు చదువుకుంటే నాలుక కోసేయ్యమని ,వేదాలు వింటే వారి చెవిలో సీసం కరిగించి
పోయమని ,
నీ
మతం చెబుతుంది నాలుగవ వర్ణం పురుషుడు పై వర్ణాల స్త్రీ లను (ప్రతిలోమ)వివాహం
చేసుకుంటే ,అతడిని చెట్టుకు కట్టేసి చచ్చేవరకు
కొరడాలతో కొట్టమని వారికి పుట్టిన సంతానం పంచములు అవుతారని ,వారు అంటరానివారు అని, కాని అదే నీ మతం శాషిస్తుంది పంచమవర్ణ
స్త్రీలు మాత్రం జోగినులగా మారి మీ దేవుళ్ళకు ఉంపుడు గత్తెలుగా వుండాలని,వారితో (అగ్ర వర్ణ )ఊరిపెద్దలందరూ
తమకామవాంచలు తీర్చుకొవచ్చని ,మిత్రమా
అదే నీ మతం చెబుతుంది ఐదవవర్ణం(పంచములు) వారు ఊరి బయటే వుండాలని
,అదే నీ మతం
చెపుతుంది కుక్కలు , పశువులు , పక్షాదులైనా ఊరి చెరువులో నీరు త్రాగి ఆ
చేరువులోనే అవి స్నానం చేసి వాటి మల ,మూత్రాలను విసర్జించ్చినా పరవాలేదుగాని సాటి మనిషి (అంటరానివారు) ఊరిచెరువులో
నీరు త్రాగుట నిషిద్దమని, మిత్రమా ....
“నీవు
కుక్కలను ,పశువులను ,పక్షులను పెంచుకుంటావు , ఎత్తుకుని ముద్దాడుతావు,వాటిని శుబ్రం చేస్తావు చివరకు పశువు
మూత్రం కూడా పవిత్రమైనదని పాయసం లాగా త్రాగుతావే , సాటి మానవుడు అంటరాని వాడు” గా నీకు ఎలా కనిపించాడు ,మిత్రమా ?”
నీ
మతం మానవత్వానికే మచ్చ,నీ మతం
మానవ హక్కులకే ఒక సవాల్ అటువంటి నీ మతంలో ఇన్ని లోపాలున్నా , నాకు ఇంతకష్టం ,ఇంత నష్టం కలిగించినా ,నన్ను దారుణంగా అవమానించినా ,... నీ మతాన్ని,నీ మతమౌడ్యాన్ని,నీ మత చాందసాన్ని నీవు ఏ మాత్రం
సరిచేసుకోవు ,
సంస్కరించుకోవు , పైగా నీవు నాకు చెబుతావు.... ఈ దేశంలో
పుట్టినందుకు నీ మతాన్నే
నేను ఆచరిస్తూ చచ్చినట్టు జీవించ్చలనీ ?నీ మతానికే ఎప్పుడూ నేను బాజాలు కొడుతూ గౌరవించ్చాలని ? నీ మతాన్ని నేను ఎప్పుడూ పొగుడుతూ మీ
అగ్రవర్ణాలకు ఎప్పటికి నేను బానిసగా ఉండాలని ? నీ మతాన్ని నేను ఎప్పుడు తిట్టకూడదు ,ప్రశ్నించ కూడదు ,విమర్శించ కూడదు అని ,..... కాని ఏ మాత్రం నీతి ,న్యాయం ,సమానత్వం,సిగ్గు లేని నీ చెత్త మతాన్ని, నేను ప్రశ్నిస్తా , మరలా ,మరలా ,మరలా ! .
మత
మూర్ఖపు పిరికిపందల చేతిలో నేలికొరిగిన "ధీరవనితకు " మా వందనాల.
గౌరీ లంకేష్ కు జోహార్లతో....