మానవ జాతి విజ్ఞాన అభివృద్ధి ని మలుపు తిప్పిన గొప్ప గ్రంథం *చార్లెస్ డార్విన్* రాసిన *"THE ORIGIN OF SPECIES BY MEANS OF NATURAL SELECTION."*
*1859, నవంబర్ 24* న తొలిసారిగా ప్రచురితమైన రోజును ప్రపంచ వ్యాప్తంగా *" ప్రపంచ పరిణామ దినోత్సవం"* గా జరుపుకుంటారు..
*ఆరిజిన్ ఆఫ్ స్పెసిస్* గ్రంథంలో *చార్లెస్ డార్విన్* ప్రతిపాదించిన *"జీవ పరిణామ సిద్దాంతం"* అప్పటి వరకు జీవుల పుట్టుకకు సంభందించి మానవుల ఆలోచనలను పూర్తిగా మార్చివేసింది. మతగ్రంథాలను ఖగోళ శాస్త్రం కొట్టిన దెబ్బకన్న జీవశాస్త్రము అందులో జీవ పరిణామ సిద్దాంతం కొట్టిన దెబ్బ చాలా పెద్దది.
చార్లెస్ డార్విన్ 1809 ఫిబ్రవరి 12న ఇంగ్లండులోని ష్రూస్‌బరీలో జన్మించాడు. తన కొడుకును మతాధికారిగా చూడాలనుకున్న తన తండ్రి కోరికకు వ్యతిరేకంగా *"హెచ్ ఎమ్ ఎస్ బీగిల్"* అనే వ్యాపార నౌకలో 1831, డిసెంబర్ 27 న బయలు దేరి సుమారు *ఐదు సంవత్సరాలు ప్రయాణం* సాగించి 1836 లో స్వదేశానికి తిరిగి వచ్చాడు. నౌక లంగరు వేసిన ప్రతి ప్రదేశంలో అక్కడి *పక్షులు , చెట్టు మరియు జంతువుల వివరాలను జాగ్రత్తగా సేకరిస్తు* వెళ్ళాడు.
దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలో పెరూ దేశానికి దగ్గరగా ఉన్న *గెలాపాగోస్ దీవుల్లో ఫించ్ పక్షి జాతుల్లో తేడాలు గమనించాక* తన డైరీలో ఇలా రాసుకున్నాడు "ఈ అనంతమైన వైవిధ్యానికి అంతులేని వైచిత్రికి ఒకే ఒక్క కారణం ఉండాలి. ఈ జీవరాసులన్నింటికి పూర్వీకులు ఒకరైతేనే తప్ప , ఈ పోలికలు మరియు తేడాలకు మరో కారణం దొరకదు. కోట్ల సంవత్సరాల క్రితం ఈ పూర్వికులు ఈ భూభాగం నించి దీవులకు వలస వచ్చి క్రమేణా మార్పు చెందుతూ ఎక్కడివి అక్కడ జాతులుగా ప్రజాతులుగా విడిపోయి వుండాలి".
తరతరాలుగా మతం నిర్మించిన అంధ విశ్వాసాలకు నిర్ధాక్షణ్యంగా గోరి కట్టేందుకు వీలు కల్పించిన *"ఆరిజిన్ ఆఫ్ స్పెసిస్"* గ్రంథం వైజ్ఞానిక ప్రపంచంలో గొప్ప సంచలనాన్ని సృష్టించింది. మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉందనే కారణం తో ఆనాటి మతాధికారులు మతద్రోహంగా పరిగణించారు. తమ కట్టుకథల చిట్టా పుస్తకాల్లో, చిట్టా కథల రెట్ట పుస్తకాలలో చెప్పిన విదంగా "దేవుడనేవాడు మన్ను మషాణం తన ఆకారంలో బొమ్మను చేసి ఉఫ్ఫ్ మని గాలి ఊదితే మనిషి పుట్టుకొచ్చాడు" అనే కాకమ్మ కథకు వ్యతిరేకంగా డార్విన్ చెప్పిన మానవ పరిణామం వ్యతిరేకంగా ఉండటం వలన దైవ ద్రోహంగా ప్రకటించారు. ఈ మత గురువులు సృష్టించిన అల్లకల్లోలం వలన చార్లెస్ డార్విన్ జీవ పరిణామం పై రాసిన అమూల్యమైన పరిశోధన ప్రతులను దాచిపెట్టవలిసి వచ్చింది. ఆయన రాసిన పత్రాలు పూర్తిగా ప్రచురితమై ఉంటే జీవ పరిణామ పరిశోధనలు ఎంతో సులభ సాద్యమై ఉండేవి..
డార్విన్ తన సిద్దాంతాన్ని వెలువరించి 150 సంవత్సరాలు దాటింది. ఆయన తరువాత పరిణామం గూర్చి అనేక పరిశోధనలు జరిగాయి. అనేక నూతన విషయాలు కనుగొన బడ్డాయి. వాస్తవ మైన పరిణామ సిద్దాంతం సజీవంగానే ఉంటుంది. పరిశోధనలు వలన కొత్త ఆంశాలు చేర్చబడుతాయి. ఎందుకు కొరగాని చచ్చు సృష్టివాద సిద్దాంతాలే ఏ మార్పు లేకుండా జీవచ్ఛవాల్లా ఉంటాయి.
వేల ఏళ్ళుగా మత అంధ విశ్వాసాలపై నిద్రిస్తున్న మానవాళిని తట్టి మేల్కోలిపి, సృష్టి గురించి మత గ్రంథాలలోని కట్టుకథలను, మతాధికారులు చేసిన అబద్ధపు ప్రచారాన్ని కాలదన్ని *ఈ జీవ సృష్టికి దేవుడు కారణం కాదు , కోట్ల సంవత్సరాలుగా జరిగిన సుదీర్ఘ పరిణామమే కారణం* అని శాస్త్రీయంగా నిరూపించిన గ్రంథం మొదటి సారిగా ప్రచురితమైన ఈ రోజున ఆయన్ని మరోసారి స్మరించుకుందాం..
*"ప్రపంచ పరిణామ దినోత్సవ శుభాకాంక్షలు"*
..రాం ప్రదీప్