ప్రశ్న కొంచెం పెద్దదే, ఐనా తెలుసుకో దగిన అంశమే ఇది, మీ కోసం ఇస్తున్నాను ఓపిగ్గా చదవండి.. ! -- చెలిమెల.
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
ప్రశ్న: మనకు రెండు కాళ్లు, రెండు చేతులు, రెండు కళ్లు, రెండు చెవులు, రెండు నాసికా రంధ్రాలు, రెండు ఊపిరి తిత్తులు, రెండు వక్షోజాలు వున్నాయి, గానీ రెండు తలలు, రెండు మెడలు, రెండు గుండెలు, రెండు పొట్టలు, రెండు నాభి రంధ్రాలు, రెండు మేహనాలు (పురుష జననాంగాలు), రెండు యోని రంధ్రాలు (స్త్రీ జననాంగాలు) ఎందుకు
లేవు.. ?
బ్రహ్మకు నాలుగు తలలు, రావణునికి పది తలలు ఉన్నట్లు కొందరు దేవతా
వ్యక్తులకు నాలుగు చేతులు ఉన్నట్లు మనకు ఎక్కువ తలలు, ఎక్కువ చేతులు ఉంటే మరింత ఎక్కువ మేధస్సుతో, ఇంకా ఎక్కువ శ్రమ చేసే వాళ్లమే కదా ?
(ఒక కార్యక్రమంలో., శాస్త్రవేత్తలతో ముఖాముఖి సందర్భంగా రామచంద్రయ్య
గారిని స్కూల్ విద్యార్థులు అడిగిన ప్రశ్న ఇది..)
జవాబు : సుమారు 600 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వావిర్భావ సంఘటనలో భాగంగా సౌరపళ్లెం (Solar Disc)ఏర్పడగా అందులోని అంచుల్లోని భాగాలు, గ్రహాలుగా, మధ్య భాగం సూర్యుడిగా సౌర కుటుంబం పరిణమించింది. సూర్యుడి
నుంచి మూడవ గ్రహంగా సుమారు 500 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది. ఆ తదుపరి
సుమారు 50 కోట్ల సంవత్సరాలకే భూమ్మీద ఎన్నో భౌతిక రసాయనిక సంఘటనలు గతితార్కిక
పద్ధతిలో జరగ్గా సముద్రాల్లో పేరుకుపోయిన ఆదిమ పులుసు(Primordial Soup) నుంచి జీవాణువులు (Bio Molecules) ఏర్పడ్డాయి. ఈ అణువులే కాలక్రమేణాDNA / RNA పేలికలుగా మారి వివిధ
పరిణామ దశలలో వృక్షకణాలు, జంతుకణాలు, బాక్టీరియాలు, వైరస్‌లుగా రూపొందాయి. ఆ విధంగా భూమ్మీద దాదాపు 400 కోట్ల సంవత్సరాల క్రితమే నిర్జీవ పాదార్థిక ద్రవ్యాల నుంచి జీవ సంబంధ
పాదార్థిక కణాలు ఏర్పడ్డాయి. మరోమాటలో చెప్పాలంటే జీవాన్ని ఎవరూ సృష్టించలేదనీ
జీవానికీ, నిర్జీవానికీ పాదార్థిక అనుబంధం ఎల్లెడలా, ఎల్లపుడూ ఉందనీ అర్థం చేసుకోవాలి. ఆదాము (Adams), అవ్వ (Eve)
లను యెహోవా మొదట రూపొందించాడన్న విశ్వాసం గానీ, బ్రహ్మ శరీరం నుంచి ఆయన దర్శకత్వం, స్క్రీన్‌ప్లేలో మనువాదులు పేర్కొన్నట్లుగా మానవ
జాతి ఆవిర్భావ విశ్వాసం గానీ శాస్త్రపరిశోధనల వెలుగులో అబద్దాలని రూఢి అయ్యింది. అది
వేరే విషయం. జీవకణాల్లోనే జీవం ఉంటుందన్నది ఇపుడు శాస్త్ర సమాజం మొత్తం
అంగీకరిస్తున్న వాస్తవం. అంటే... పాదార్థిక బంధంలో వాస్తవ పదార్థం (ద్రవ్యరాశి, కాలం, స్థలం వంటి మౌలిక ధర్మాలున్న యదార్థ రూపం)తో రూపొందిన జీవకణంలోనే జీవం
ఉందన్నమాట. జీవానికి నిర్జీవానికీ ప్రధాన వైరుధ్యాలు 7 వున్నాయి.
1. పెరుగుదల (Growth): ప్రకృతి ధర్మమైన గురుత్వాకర్షణను అధిగమించి ఆంతరంగిక వైరుధ్యాల ప్రమేయంతో
నేలనుంచి పైకి రూపంలో అభివృద్ధి కావడం జీవధర్మం. ఈ ధర్మం నిర్జీవ పదార్థానికి
ఉండదు.
2. ప్రత్యుత్పత్తి (Reproduction): తనలాంటి మరో రూపాన్ని కనిష్టస్థాయిలో రూపొందించుకొనే సంతాన రూపకల్పన ధర్మం.
ఇది జీవ ధర్మం. నిర్జీవులు తమలాంటి రూపాన్ని తయారు చేసుకోలేవు.
3. వంశ పారంపర్యత (Heredity):బాహ్యరూపంలోనే కాకుండా ఆంతరంగిక పాదార్థిక నిర్మాణాన్ని కనిష్ట వ్యత్యాసంతో
తరువాతి తరాలకు బదలాయించే లక్షణం. ఇది జీవ ధర్మం. నిర్జీవ పదార్థానికి తరాలు లేవు
కాబట్టి వంశ పారంపర్యత అన్న ప్రస్తావనే లేదు.
4. స్థిరత్వం(Homeostasis) : తన రూపాన్ని, అస్తిత్వాన్ని నిలబెట్టుకొనేందుకు తీవ్ర ప్రయత్నం
చేసే ధర్మం. తన దేహానికి, ఉనికికి భంగం కలిగించే వైరుధ్యాల దాడి నుంచి తనను
తాను రక్షించుకొనే ధర్మం (దీన్నే మామూలు భాషలో 'ఎలాగైనా బ్రతకాలనే అనుకోవడం' గాను లేదా 'చావును కోరుకోకపోవడం' గాను భావించవచ్చును). నిర్జీవులకు ఆ ధర్మం లేదు. చీమయినా ఎవరయినా
స్పృశిస్తేనే ఏమవుతానో అన్న భయంతో పారిపోతుంది. అంతకన్నా ఎన్నోరెట్లు పెద్దగా
వున్న గాజు పలక మీద రాయి పడబోతున్నా ఆ గాజుపలక పారిపోదు. తనను తాను
రక్షించుకోవడానికి ఎదురొడ్డి మనల్ని కుట్టదు.
5. జీవ భౌతిక రసాయనిక
చర్యలు (Metabolism)
: దేహంలోకి వెళ్లిన రసాయనాలు ప్రత్యేకమైన
నిర్థిష్టమైన చర్యల శ్రేణి స్వతహాగా (ఱఅష్ట్రవతీవఅ్) ఉంచడం. ఉదాహరణకు అది
చెట్టయినా, చీమ అయినా, పాము అయినా, మనిషి అయినా, ఆవు, పంది ఏదయినా గ్లూకోజు ఆక్సీకరణం (ఉఞఱసa్‌ఱశీఅ) కావడం ద్వారానే శక్తిని సమకూర్చుకోవడం. పద్ధతి వేరయినా ఒకటి అర
మినహాయిస్తే ప్రతి జీవికీ ఆక్సిజన్ ద్వారానే గ్లూకోజు నుంచి శక్తి రావడం. వచ్చిన
శక్తి ఎల్లపుడూATP రూపంలోనే ఉండడం. నిర్జీవ పదార్థాలకు ఈ ధర్మం లేదు.
6. కణ స్వభావం (Cellular Structure) :రూపం, బాహ్య స్వరూపం వేర్వేరుగా వున్నా జీవులు చిన్నవయినా పెద్దవయినా జీవ
ధర్మానికి తొలి ప్రమాణం(Primary Unit), ప్రాథమిక స్థావరం జీవకణం (Primary Origin) కావడం. ఇందులో DNA అనే పదార్థం కేంద్రకం (nucleus)లో ఉండడం లాగా గానీ (Eukaryotic cell) లేదా కేంద్రకం లేకుండాగానీ (Prokaryotic cell) విధిగా కణంలో ఉండడం. DNA పేలికల్లోని కొన్ని స్థావరాల (genes) అజమాయిషీలో DNA వెలుపల కణద్రవ్యం (సైటోప్లాజం:Cytoplasm)తో జీవ భౌతిక చర్యలు (Metabolism) జరగడం. ఇది జీవ ధర్మం. అంటే జీవకణం ఛిద్రమయితే
జీవమే ఛిద్రమయ్యి నిర్జీవమైనట్లు భావించాలి. దీన్ని ఆధారం చేసుకొనే హేతువాదులు, నాస్తికులు, ప్రజాసైన్సు ఉద్యమకారులు దయ్యాలు, భూతాలు, అతీంద్రియ శక్తులు, దైవ ప్రత్యక్షం, అంతర్థానం వంటి భాష్యాల్ని వ్యతిరేకిస్తారు. ఈ
అశాస్త్రీయ పోకడల్లోకి ప్రజల్ని నిర్జీవంగాను, కపట బుద్ధితకు నెట్టే ప్రజావ్యతిరేక వర్గ
ధోరణుల్ని ధైర్యంగా ప్రతిఘటిస్తారు.
7. ప్రతిస్పందన (Response) పరిణామం (Evolution) : తన మానాన తానున్నా బాహ్య పరిస్థితులు తన ఉనికికి
ప్రతికూలతలో ఉన్నపుడు వెనుjపట్టు పట్టి పలాయన పద్ధతిలో గానీ లేదా
ఎదుర్కొనేందుకు వీలుగా పరిణమించడంగానీ జీవ లక్షణం. ఈ లక్షణమే మీరన్న ప్రశ్నలోని
అన్ని అంశాలకు సమాధానాన్ని యిస్తుంది. చుట్టుపక్కల ఉన్నట్లుండి ఉష్ణోగ్రత పెరిగినా, తరిగినా, విష స్వభావం వచ్చినా ఎక్కడవేసిన గొంగళి అక్కడే
అన్నట్లుగా ఏ జీవులు (గొంగళి పురుగులతో సహా) మసలు కోవు. సూర్యరశ్మి కోసం చెట్టు
కొమ్మల విస్తారాన్ని తదనుగుణంగా పెంచుకొంటాయి. వేడి సెగ వస్తే పురుగులు కూడా
తప్పించుకొంటాయి. ప్రకృతిలో సంభవించే మార్పులు తమ ఉనికికి భంగం కలిగించే విధంగా
వుంటే ప్రకృతితో పోరాడేందుకు ఏ రూపం ఏ ధర్మం అవసరమో ఆ రూపంలోకి, ఆ ధర్మంలోకి తనను తాను సర్దుబాటు చేసుకోవడం జీవ లక్షణం. ఎందరో
శాస్త్రవేత్తలతో పాటు ఫ్రెడరిక్ ఎంగెల్స్ (1870) వంటి ఎందరో ప్రకృతిలో
జరిగే మార్పులకు అనుగుణంగానే జీవ పరిణామం జరిగిందని తెలియజేశారు. తద్వారానే చాలా
జాతులు ఆవిర్భవించాయనీ ప్రకృతితో తలపడి నిలబడే లక్షణాలు, ధర్మాలు, జాతులు నిలబడ్డాయనీ, అలా సర్దుకొనే లక్షణాలు లేనివి అంతరించిపోయాయనీ తన
ప్రసిద్ధ గ్రంధమైన 'ప్రకృతివరణం- జాతుల ఆవిర్భావం' (Origin of Specice by
Natural Selection) లో మహనీయుడు ఛార్లెస్ డార్విన్ సోదాహరణంగా
పేర్కొన్నాడు. ఆ క్రమంలోనే మానవ జాతి కేవలం సుమారు 20 లక్షల సంవత్సరాల క్రితం భూమ్మీద ఆవిర్భవించింది. నాలుగు
చేతులు, పది తలలు, చతుర్ముఖం, బహు యోనులు (multiple vaginas), పలు మేహనాలు (multiple penises) వంటి వన్నీ భావాలు మాత్రమే. అలాంటి జీవులు మానవుల
ఊహల్లో మాత్రమే వుంటాయి. ఆ లక్షణాలు ప్రకృతితో తలపడలేవు. ఒకవేళ కాకతాళీయంగా అలాంటి
శిశువులు పుట్టినా శిశుప్రాయంలోనే మరణిస్తారు. రెండుగుండెలు, రెండు మెడలు శరీరాన్ని గందరగోళం చేస్తాయి. ఒకే తల్లి గర్భంలోంచి వచ్చిన
శిశువుకు ఒకే బొడ్డుతాడు వుంటుంది. కాబట్టి రెండు నాభిలు మనకు వుండవు. రెండు
ఊపిరితిత్తుల వల్ల ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. రెండు కళ్ల వల్ల త్రిమితీయ దృష్టి (binocular vision) సాధ్యమయ్యింది. త్రినేత్రం ఎక్కడా లేదు. అది తెరుచుకొంటే వెలుగు రాదు. కళ్లేమీ
టార్చిలైట్లు, లేజర్ గన్నులు కాదు. తమకు లేని లక్షణాల్ని, శక్తుల్ని మహత్యాల పేరుతో దేవుళ్లకు ఆపాదించి తాము
రూపొందించుకున్న మిథ్యా వ్యక్తులు లీలాపోహల్ని ప్రత్యక్షంగా వాస్తవమైన తమ మెదళ్లలో
ఊహించుకొని కోట్లాదిమంది తమ హేతు దృష్టిని, మానవ సహజమైన మీమాంస, తార్కిక బుద్ధిని మతం మత్తులో అంతర్ధానం
చేసుకొంటున్నారు. ఇది ప్రజల స్వంత లక్షణం కాదు. శ్రామికుల్ని, జనావళిని దోచుకొనేందుకు దశముఖాలు, చతురాంగాల సాయంతో రూపకల్పన చేసిన దోపిడీవర్గాల
మతతత్వ రాజకీయ లీలావిలాసం.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య,
నిట్, వరంగల్, సంపాదకులు,
చెకుముకి, జన విజ్ఞాన వేదిక.
email: allikayala@gmail.com
*** ***