ఒక్క సారి చరిత్ర ను పరిశీలిస్తే.. మొదట గుర్తుకు వచ్చేది crusades (వీటిని తెలుగులో మత యుద్దాలు అంటారు) క్రిస్టియన్స్ కి అరబ్బులకు జెరూసలేం కొరకు జరిగినాయి. మొదటి యుద్ధం లో క్రిస్టియన్స్ విజయం సాధించి.. మిగిలిన రెండు యుద్ధాలలో అరబ్బుల చేతిలో ఓడిపోయారు. ఈ యుద్ధం ఎంతో రక్త పాతాన్ని మిగిలిచింది..
రెండవది... పోప్ అనుయాయులు, మార్టిన్ లూథర్ అనుయాయులకి జరిగిన అంతర్యుద్ధం, అది సుమారుగా1560 ఆ ప్రాంతం లో మొదలైయింది.. అది యూరోప్ అంతా దాదాపుగా 30 సంవత్సరాల పాటు జరిగి ఎంతో ప్రాణ నష్టానికి కారణం అయింది.. దీనితో అన్ని క్రైస్తవ దేశాలు " మతాన్ని" పరిపాలన నుండి పూర్తిగా వేరుచేసి ఎంతో వేగంగా అభివృద్ధి సాధించారు. ఇప్పుడు అక్కడ మతం అనేది వ్యక్తిగతం.. అంతే కాదు మతాన్ని పాటించే వాళ్ళు 3 లేక.4% కూడా ఉండరు.
ముస్లిం దేశాల పరిస్థితి. దాదాపుగా అన్ని ముస్లిం దేశాలు మత ప్రాతిపదికనే ఉన్నాయి .ఒక్క టర్కీ తప్ప( ఎందుకంటే అది యూరోపియన్ యూనియన్ లో భాగం గా ఉంది) దాదాపుగా మిగిలిన అన్ని దేశాలు ఏదో ఒక మత సమస్య తో బాధపడుతూనే ఉన్నాయి, అంటే షియా ,సున్ని.. లేదా ఉగ్రవాదం లేదా ఇంకొక్కటి.. ఇప్పుడు సిరియా మారణహోమం, ఆఫ్గనిస్తాన్, ఇరాన్, ఇరాక్, లిబియా... ఈ దేశాలు కూడా మతాన్ని ప్రభుత్వం నుండి వేరుచెయ్య నంత వరకు, మతాన్ని వ్యక్తి గతమైన విషయం గా చెయ్య నంత వరకు.. మారణ హోమం తప్పదు.. ప్రస్తుతం జరుగుతున్నది అదే.
ఇక చైనా. ... చైనాలో కమ్యూనిజం రాకపూర్వం అక్కడ బౌద్ధం అధికార మతం గా ఉండేది, ఎప్పుడైతే కమ్యూనిజం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో, అప్పటి నుండి మతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు .ఎందుకంటే కమ్యూనిస్టులు మతానికి వ్యతిరేకులు.. ఇప్పుడు చైనా ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచింది.
చరిత్ర నుండి ఏమీ నేర్చుకోని మన పాలకులు మన దేశంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, మతానికి ప్రాముఖ్యత ఇస్తూనే వచ్చారు, అంటే మత ప్రాతిపదికన ఓట్లు అడగడం. మత ప్రాతిపదికనే కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఇవ్వడం, ఎలక్షన్స్ లో అధికారం కోసం మతాన్ని రెచ్చగొట్టడం.. ఇలా చాలా చాలా, కాని ఏ ప్రభుత్వం కూడా "మతం వేరు ప్రభుత్వం వేరు" అని స్పష్టం గా విడదీయలేకపోయింది. పేరుకు సెక్యులర్ అయినా ప్రతి విషయం లో మతానిదే ఆధిపత్యం. కాబట్టి మనం ఇంకా మూఢ నమ్మకాల ముసుగులో జీవిస్తూ సైన్స్ ని కూడా అపహాస్యం చేసే స్థాయికి చేరుకున్నారు మన రాజకీయ నాయకులు.
ప్రపంచంలో మత ప్రాతిపదిక న ఏర్పడిన దేశాలు రెండు..1 పాకిస్థాన్. 2 ఇజ్రాయెల్ ..ఈ రెండింటిలో శాంతి అనే మాటే లేదు ఎప్పుడూ ఏదో ఒక దాడులు, మారణహోమం. కాబట్టి మతం వలన ఏ దేశం కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందదు. పైగా మతం పేరుతో ఎంతో విధ్వంసం మరియు విద్వేషం ! ఇలాంటివి అభివృద్ధి చెందాలి అని భావించడం ఏ దేశానికీ శ్రేయస్కరం కాదు.
కాబట్టి నా ప్రియ భారతీయులారా.. మతాన్ని కేవలం వ్యక్తి గతమైనదిగా పరిగణించి అంతటితో వదిలి వెయ్యండి..సైన్స్, హేతుబద్దతకు ప్రాముఖ్యం ఇవ్వండి..ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు మానవాళి కి మంచి కన్నా కీడే ఎక్కువగాచేశాయి.. ..
వివేకంతొ ఆలోచించి ముందుకు సాగండి..-ప్రొఫెసర్ ఏ. రామచంద్రయ్య