" ఆశయాలు: 1.శాస్త్ర విజ్ఞానం ద్వారా మూఢ విశ్వాసాలను, ఛాందస భావాలను అరికట్టడం"

ఆశయాలు: 2. సామాన్య ప్రజల్లో శాస్త్ర విజ్ఞానం ప్రచారం చేయడం శాస్త్రీయ దృక్పధాన్ని పెంపోందించడం.

ఆశయాలు: 3. వివిధ రంగాలలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని శాస్త్రపరిశోధనల్ని ప్రోత్సహించడం.

ఆశయాలు: 4. ప్రజలు ఎదుర్కోంటున్న అనేక సమస్యల మౌలిక స్వరూప స్వభావాలను గురించి సమగ్రమైన శాస్త్రీయ అవగహనను పెంపొందించడం, పరిష్కరాలు అన్వేషించడం.

ఆశయాలు: 5. ఏ కొద్దిమందికో పరిమితమైన శాస్త్ర విజ్ఞానం సామాన్య ప్రజలకు సైతం అందేటట్లు ప్రయత్నించడం.

ఆశయాలు: 6. సత్యాన్వేషణకు, దేశస్వావలంబనకు, సమగ్రతకు, లౌకికతత్వానికి, ప్రపంచశాంతికి, సామాజికాభివృద్ధికి, సాంస్కృతిక వికాసానికి కృషిచేయడం.


The State unit of Jana Vignana Vedika which is striving to create awareness among people about the importance of science with the objectives of science for the people, science for the progress and science for self-reliance and also to impress them about the evils of superstitions since its inception1988 has been selected winner of National Award for Best Efforts for Science and Technology Communications for the year 2005. JVV is undertaking several programs like seminars, workshops, science fairs, training camps to inculcate the spirit of scientific temper in the society. Also JVV Championed many social tasks like literacy movement, prohibition of arrack, against fish medicine, Cool Drinks. JVV derives its strength from all sections of the society including scientists, professors, lecturers, teachers, doctors and many social activities. Besides JVV is running an exclusive 'Children's Science 'CHEKUMUKI' in Telugu since 1990. JVV has also published many books for the enhancement of children's creativity.

సైన్సే నా మతం


(నవంబర్ 7, సి.వి. రామన్ జయంతి సందర్భంగా)

1930లో సి.వి. రామన్‌కు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చిన తరువాత ఇప్పటి వరకు మన దేశంలో జన్మించి, నివసిస్తున్న ఏ ఒక్క శాస్త్రవేత్తకు నోబుల్ బహుమతి లభించకపోవడం దురదృష్టకరం. మన దేశంలో జన్మించి, విదేశాలలో స్థిరపడ్డ హరగోవింద్ ఖురానా(1968), సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ (1983), వెంకట్రామన్ రామకృష్ణన్ (2009) లకు మాత్రమే సైన్స్‌రంగంలో నోబుల్ బహుమతులు లభించాయి.  సత్యేంద్రనాధ్ బోస్, జి.యం. రాంచంద్రన్, ఉత్పల్, మాణిక్‌పాల్ భద్ర, మేఘనాధ్ సాహా, శంభునాధ్‌డే, హోమీ బాబా, జగదీష్ చంద్రబోస్, సి.ఎన్.ఆర్.రావు వంటి భారతీయ శాస్త్రవేత్తలు సైన్స్ పరిశోధనా రంగంలో అంతర్జాతీయంగా ఖ్యాతిగడించినప్పటికీ, నోబుల్ బహుమతులు పొందలేకపోయారు. 1930లో నోబెల్‌ బహుమతి స్వీకరించిన సందర్భంలో సీవీ రామన్‌ బహుమతి ప్రదానోత్సవానికి హాజరైన సభికులకు తాను ఆవిష్కరించిన రామన్‌ ప్రభావాన్ని ప్రదర్శించేందుకు 'ఆల్కాహాల్‌'ని మాద్యమంగా ఉపయోగించారు. అనంతరం ఏర్పాటుచేసిన కాక్‌టెయిల్‌ పార్టీలో 'ఆల్కాహాల్‌ తీసుకుంటారా'?  అని రామన్‌ను విందుకు హాజరైనవారు అడుగగా 'ఇప్పటి వరకు మీరు ఆల్కహాల్‌లో రామన్‌ ఎఫెక్టు చూసారు, రామన్‌పై ఆల్కహాల్‌ ఎఫెక్ట్‌ చూడాలని కోరుకోవద్దు' అని చమత్కరించి పరోక్షంగా తాను మద్యానికి దూరంగా ఉంటాననే విషయాన్ని స్పష్టం చేశారు. చంద్రశేఖర వెంకట్రామన్‌ 1888 నవంబర్‌ 7న ఆనాటి మద్రాసు ప్రావిన్సులోని తిరుచరాపల్లిలో చంద్రశేఖర్‌ అయ్యర్‌, పార్వతి అమ్మాల్‌ దంపతులకు జన్మించారు. ఆయన బాల్యం నుంచే చురుకైన విద్యార్థిగా వుంటూ కేవలం 11 సంవత్సరాల వయస్సులోనే మెట్రిక్యులేషన్‌ పూర్తి చేశారు. చిన్నతనం నుంచే పరిశోధన రంగంపై ఆసక్తి వున్న ఆయన విద్యాభ్యాసం అనంతరం 1907లో ఇండియన్‌ ఫైనాన్స్‌ డిపార్టుమెంట్‌లో అసిస్టెంట్‌ ఎకౌంటెంట్‌ జనరల్‌గా చేరారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు పరిశోధనపై దృష్టి సారించారు. తన లక్ష్యసాధన కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1917లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేరారు. 1919లో 'ది ఇండియన్‌ అసోషియేషన్‌ ఫర్‌ ది కల్టివేషన్‌ ఆఫ్‌ సైన్స్‌కు' గౌరవ కార్యదర్శిగా నియమితులయ్యారు. సీవీ రామన్‌ కాంతిపై పరిశోధనలు చేసి 1928లో 'రామన్‌ ఎఫెక్టు' కనుగొన్నారు. కాంతి కిరణాలు ఒక ద్రవ పదార్ధంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది, అంటే కాంతికిరణాలలోని ఫొటాన్‌ కణాలు ద్రవపదార్థాల పరమాణువులపై పడి పరిక్షేపణ చెందుతాయి. దూరపు కొండలు, సముద్రపు నీరు, ఆకాశం నీలి రంగులో ఉండటానికి గల కారణాలను రామన్‌ ఎఫెక్టు విశ్లేషిస్తుంది. వైద్యరంగంలో మందుల‌ విశ్లేషణకు, రసాయన పదార్థాలలోని అణువులు, పరమాణువుల పరిశీలనకు, మనం ధరించే వస్త్రాల రంగుల అధ్యయనానికి రామన్‌ ఎఫెక్టు దోహదపడుతుంది. ఆయన పరి శోధనలకు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది. రామన్‌ ఎఫెక్టు కనుగొన్న రోజైన ఫిబ్రవరి 28ని భారత ప్రభుత్వం 'జాతీయ సైన్స్‌ దినోత్సవంగా' ప్రకటించింది. 1933లో బెంగుళూరులోని ప్రతిష్టాత్మక 'ది ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌'కు రామన్‌ డైరెక్టర్‌గా నియమించబడ్డారు. 1948లో ఆయన బెంగుళూరులో 'రామన్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ను' స్థాపించి పలు వురు యువశాస్త్రవేత్తలను ప్రోత్సహించారు. కేవలం రూ.250తో రామన్‌ తన ప్రయోగాన్ని ఆవిష్కరించడం విశేషం. 1954లో రామన్‌ని 'భారతరత్న' వరించింది. మత విశ్వాసాల ఆధారంగా విద్యాలయం నడిపే ఒక మతసంస్థ రామన్‌ను తమ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించమని ఆహ్వానిస్తే 'స్వర్గం, నరకం, పునర్జన్మ వంటి అశాస్త్రీయ విషయాలపై నేను మాట్లాడను' అని ఆ సంస్థ ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. 'సైన్సే నా మతం' అని రామన్‌ స్పష్టం చేశారు. ఆయన ధ్వనిపై కూడా పలు పరిశోధనలు చేసారు. నోబెల్‌ బహుమతి పొందినప్పుడు రామన్‌ ఒకవైపు సంతోషం వ్యక్తంచేస్తూనే మరొకవైపు 'దేశం పరాయిపాలనలో ఉందని బహుమతి అందుకునేటప్పుడు నాదేశం తరపున, నా దేశ జాతీయజెండా లేకపోవడం నన్ను బాధిస్తుందని' రామన్‌ తెలిపి దేశం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. 'ది లైట్‌ ఆఫ్‌ ఏషియా' పుస్తకం రామన్‌పై అమిత ప్రభావం చూపించింది. ఆత్మన్యూనతా భావాన్ని, ఓటమి భయాన్ని వీడి ధైర్యంతో ముందడుగు వేసి పరిశోధనా రంగంలో భారత కీర్తి ప్రతిష్ఠలను అంతర్జాతీయంగా నిలపాలని' రామన్‌ విద్యార్థులకు సూచించారు.
- యం.రాంప్రదీప్‌
తిరువూరు
సెల్‌ నెం.9492712836

మూఢనమ్మకాలు తగ్గేదెలా?

ప్రశ్న:మూఢనమ్మకాలు తగ్గేదెలా?  
*******************************
జవాబు: విజ్ఞానశాస్త్రం ఇంత ఎదిగినా ప్రజల్లో మూఢనమ్మకాలు సడలకుండా ఉండడానికి కారణం ప్రజాసంక్షేమ ప్రభుత్వాల చేతుల్లో కాకుండా స్వార్థ ఆర్థిక ప్రయోజనాలు పొందే దోపిడి వర్గాల చేతుల్లో సైన్సుసైన్సు ఫలితాలు ఉండడమే!

ప్రకృతి రహస్యాల్ని ఛేదించి నిజాలేమిటోవాస్తవాలేమిటో సైన్సు తేటతెల్లం చేస్తుంది. ఆ నిజాల ఆధారంగా సాంకేతికత  సిధ్దిస్తుంది. ఆ సాంకేతికతను పరిశ్రమలుఉత్పత్తి రంగాలుసేవారంగాలు మొదలైన పెట్టుబడి ఆధారిత వ్యవహారాల్లో పెట్టుబడిదారులు అన్వయించి మరింత ఎక్కువ లాభాల్ని పొందడానికి వినియోగిస్తారు. అదే సమయంలో ఆయా సంస్థల్లో పనిచేసే శ్రామికులకార్మికుల సంఖ్యను తగ్గించే మానవేతర స్వయం చోదిత పద్ధతుల్లో ఉత్పత్తుల్ని పెంచుతారు. తద్వారా వేతనాలుఖర్చులు తగ్గడం ద్వారా మార్కెట్లో ఉత్పత్తులు పెరగడం ద్వారా ద్వీగుణీకృత లాభాల్ని పెట్టుబడిదారులు దండుకుంటారు. కానీ సైన్సు తెలిపిన నిజాలు అందరికీ నిజాలే కాబట్టివాటి అభ్యసన ద్వారానే పెట్టుబడి దారుడికి సేవకులు సేవ చేయగలరు. కాబట్టి సైన్సు బోధన తరగతి గదుల్లో తప్పదు. కానీ సైన్సు ప్రజల్లో అలుముకున్న  అవాస్తవిక విశ్వాసాల్ని నిజాలనే దివిటీల వెలుగుల్లో ప్రశ్నించడం మానదు. నాదస్వరానికి త్రాచుపాము నాట్యం చేస్తుందని ఎంత గట్టిగా ప్రజలు నమ్మినా చెవుల్లేని పాము నాదస్వరం వినడమేమిటని సైన్సు ప్రశ్నిస్తుంది. కానీ పాములకు చెవులు లేవు కాబట్టి స్వరాలు వినపడవు అన్న వాస్తవాన్ని పారిశ్రామికరణకు వాడు కొనేవారుపాముల్ని నాట్యమాడించడానికేనంటూ నాదస్వరాల్ని తయారు చేసి మరో విధంగా కూడా లాభాల్ని పొందాలని పాకులాడేవారు రెండు వాదనల్ని ఉపయోగించుకుంటారు. నాదస్వరం పాములకు వినపడదు అనే సత్యంవల్ల పారిశ్రామికంగా లాభాలు పొందడం కన్నా 'నాదస్వరానికి పాములు నాట్యం చేస్తాయి. అనే అసత్యమే పెట్టుబడిదారుడికి అధిక లాభాల్నిఅధికారాన్ని ప్రజలపై అజమాయిషీని ఇస్తుందని తెలిస్తే తన చెప్పు చేతుల్లో సైన్సునుఅధికారాన్ని రెంటీని ఉంచుకున్న దోపిడి వర్గం ఈ అసత్యానికే ఎక్కువ ప్రచారం కల్పిస్తుంది. అసలు వాస్తవాన్ని మరుగున పెడుతుంది. 

ఒకవేళ ఎవరైనా ఈ అసత్య వాదనలకు ఎదురొడ్డి నట్లయితే ఆ ఆందోళన రూపాలు దోపిడీ వర్గాల దోపిడికి సవాలుగా ఉన్నట్లయితే ఆందోళనల్ని శాశ్వతంగా రూపుమాపడానికి దోపిడీ వర్గాలు ఏ మాత్రం వెనుకంజ వేయవు. 

ఒకవేళ పాములకు చెవుల్లేవు కాబట్టి అవి నాదస్వరానికి నాట్యం చేయలేవు అన్న వాస్తవమే వారికి మరింత ప్రయోజనకరంగా ఉన్నట్లయితేలేదా ఆ వాస్తవాన్ని ఎంత గింజుకున్నా కప్పి పుచ్చడానికి వీల్లేనట్లయితే దోపిడి వర్గాలు ఈ వాస్తవాలన్నీ మాకు ముందే తెలుసు. ఆనాడే మన పూర్వీకులు దీన్ని కనుగొన్నారు అంటూ మాటమారుస్తారు. ఏ గ్రంథాల్లో ముందే ఈ వాస్తవాలున్నాయని వాదిస్తారో ఆ గ్రంథాల్లో పాములు నాదస్వరానికి నాట్యం చేస్తాయిఅన్న అవాస్తవాల్ని ఎన్నింటినో పొట్టనిండా నింపుకుని ఉంటాయి. కాబట్టి మరో ఇతర సైన్సు వాస్తవాన్ని అడ్డుకోవడానికి ఉపకరించాలంటే ఆ గ్రంథానికి అన్ని విధాలైన నిర్హేతుక స్తోత్రాలతోజేజేలతో బలాల్ని ఇవ్వాలి. 

ఒకవేళ ఏ గ్రంథంలోనయితే ముందే చాలా సైన్సు విశేషాలున్నాయని వారు ఏ కరువు పెడతారో ఆ గ్రంథం తప్పుల తడక అని ఎవరైనా సాక్ష్యాధారాలతో ముందుకు వస్తేఇదుగోమీరు మా విశ్వాసాల్ని అవమాన పరుస్తున్నారంటూ న్యాయపరమైన రక్షణ కవచంలో ముందుకు వస్తారు. ఎందుకంటే న్యాయవ్యవస్థ కూడా వారి యుక్తులుప్రయోజనాల కనుగుణంగానే రూపకల్పన చేయబడి ఉంటుంది. 

మీరన్నట్లు నేడు సైన్సు ఎన్నో ఆవిష్కరణలు చేసింది. ఎంతోగొప్ప ప్రగతిని సాధించింది. సాంప్రదాయ వాదనల్లోని డొల్లతనాన్ని పూర్తిగా బయట పెట్టగలిగిన స్థాయికి సైన్సు సత్యాలు అవగతం అవుతున్నాయి. మూఢనమ్మకాలకుసైన్సు సత్యాలకు మునుపెన్నడు లేనంత తీవ్రస్థాయిలో తాత్విక ఘర్షణ అంతరంగికంగా సహజంగా తలెత్తింది. 

వర్షాలకు యజ్ఞాలకు సంబంధం లేదని తేటతెల్లం అయ్యింది. నక్షత్ర రాశుల రూపాలు శాశ్వతంస్థిరం కాదనీఅ భంగిమ మన కంటికి కనిపించే భంగిమే గానీ ఆ భంగిమ ప్రకారం నక్షత్రాలు అక్కడ ఓ తెరమీద ఉనికిలో లేవనీఆకాశమంటే ఓ తెర కాదనిఅక్కడ మనకు సింహరాశిగా కనిపించే పలు నక్షత్రాల మధ్య పరస్పర దూరం సగటున కొన్ని వేల కాంతి సంవత్సరాలనీఆఖరికి నేడు కనిపించే ఆ భంగిమ కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిదని ఆ భంగిమ మనల్ని చేరడానికి వేల సంవత్సరాలు పట్టిందనీ సైన్సు తేటతెల్లం చేసింది. కానీ జ్యోతిష్యశాస్త్రాన్ని అమలు చేసి ప్రజల కష్టాలకు కారణం పూర్వ జన్మలోనుసుఖాల ఆశలుకష్టాల పరిష్కరాల్ని భవిష్యత్తుకు లేదా మరుజన్మకు ఆపాదిస్తేనే పాలక వర్గాల మీద ప్రజాగ్రహం తగ్గుతుందని భావించే దోపిడివర్గం సైన్సు వాస్తవాల్ని మరుగున పెట్టి పంచాంగ శ్రవణానికివారఫలాలకుభాగ్యచక్రాలకుతాయెత్తులకుఉంగరాలకు సాంసారిక సామాజిక కౌటుంబిక సంక్షేమాల్ని ముడిపెట్టి తాను తన బాధ్యత నుంచి ప్రక్కకు తప్పుకుంటుంది. ప్రజాసంక్షేమానికి పెట్టాల్సిన నిధుల్ని ప్రజల్లో మూఢవిశ్వాసాల పెంపుదల కోసం వినియోగిస్తుంది. సైన్సు వ్యాప్తికన్నా భక్తివ్యాప్తికివిశ్వాసాల ఘనీభవనానికి మరింత నిధుల్ని కేటాయిస్తుంది. 

ప్రజల్ని ఇలాంటి వాస్తవికఅసంబద్ద అనాగరికఅనారోగ్య అనాచార ఆచారాల సంకెళ్ల నుంచి విముక్తుల్ని చేయడానికి పాటుపడే సామాజిక ఉద్యమ కారుల్ని అలాగే స్వేచ్ఛగా వదిలేస్తేప్రజలు తమ కష్టాలకు కారణాలు వాస్తవ జగత్తులోనే ఉన్నాయనిమతాచారాల పేరిట మన ప్రభుత్వాలుపాలక వర్గాలు మభ్యపెడుతున్నాయని గుర్తిస్తారు. అలాంటి జ్ఞానోదయంభావప్రగతిసమాచారం సత్యాన్వేషణ సామరస్య భావన దోపిడివర్గాల ప్రయోజనాలకువారికి కొమ్ముగాసే పాలక వర్గాల అధికార లాలసత్వానికి సవాలు కాబట్టి సామాజిక ఉద్యమకారుల్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో నిలువరించడానికి దోపిడీవర్గాలు ప్రయత్నిస్తాయి. వేలాది సంవత్సరాలుగా సాగుతున్న దాడీని కొనసాగించడమే ఆ వర్గాల సహజ లక్షణం. పైగా ప్రాచీన కాలంలో లేని సౌకర్యాలు నేడు వారి చేతుల్లో ఉన్నాయి. సైన్సు ఇచ్చిన సామాజిక మాధ్యమాల్ని ప్రజల మధ్య సామరస్యానికి సహవాసానికి వినియోగించే బదులు ఆందోళన కారుల్ని భయపెట్టడానికిఅసత్యాల ప్రచారానికి వాడుకుంటారు. నాడు దబోల్కర్‌ మొన్న ఫన్సారినిన్న కల్బుర్గి హత్యలు అందులో భాగమే!

ప్రజా సైన్సు ఉద్యమాన్ని బలోపేతం చేయడంశాస్త్రీయ దృక్పథాన్ని పెంచేలా విద్యావ్యవస్థను సంస్కరించడంమేథావి వర్గం మేల్కొల్పడం మాత్రమే ఈ అకృత్యాలకు నివారణోపాయాలు.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక


నవ తెలంగాణ నుండి

*చార్లెస్ డార్విన్....*

చార్లెస్ రాబర్ట్ డార్విన్ (ఆంగ్లం :Charles Robert Darwin) (ఫిబ్రవరి 12, 1809 – ఏప్రిల్ 19, 1882) ఇంగ్లాండుకు చెందిన ప్రకృతివాది,ఇతను, భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రమం చెందినది అనే విషయముపై పరిశోధనలు చేశాడు.మరియు జీవపరిణామ సిద్ధాంతాన్ని వర్ణించాడు.)
చార్లెస్ డార్విన్ పేరును తలుచుకుంటే చాలు ఎవరికైనా సరే వెనువెంటనే గుర్తుకు వచ్చేది పరిణామ సిద్ధాంతం. ప్రకృతిలో జీవజాతులు వేటికవే ఏక కాలంలో రూపొందినట్లు ఎంతో కాలం నుండి నమ్ముతూ వస్తున్న ప్రజానీకానిని - అదంతా వాస్తవం కాదని ఒక మాతృక నుంచి సకల జీవరాశులు క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడతాయని, ఈ చర్య అనంతంగా కొనసాగుతూ ఉంటుందని మొట్టమొదటి సారిగా వివరించినవాడు చార్లెస్ డార్విన్ మాత్రమే. వానరుని నుంచి నరవానరుడు, నరవానరుని నుంచి నరుడు పరిణామ పరంగా ఉద్భవించాడని తెలిపి సంచలనం రేపిన ప్రకృతి శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్.

*
బాల్యం-విద్యాభ్యాసం.*
ఈయన ష్రివ్స్ బర్గ్ లో 1809 లో జన్మించాడు. చిన్నవాడుగా ఉండేటప్పటినుండి కీటకాలను, ఖనిజాలను సేకరిస్తూ రసాయనిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తూ ఉండేవాడు. 16 యేండ్ల వయస్సులో మెడిసన్ చదవటం కోసం ఈయనను ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయంలో చేర్పించారు. కాని - మత్తుమందులు లేకుండా చేస్తున్న ఆపరేషన్లను చూచి - ఆ చిత్రహింసకు ఈయన కలత చెంది - మెదిసన్ కు మనసు పెట్టి చదవలేక పోయాడు. 1828 లో కేంబ్రిడ్జ్ కి వెళ్ళి ధియాలజీ చదివాడు. డార్విన్‌ 1809 ఫిబ్రవరి 12న ఇంగ్లండులోని ష్రూస్‌బరీలో పుట్టాడు. వైద్యుడైన తండ్రి అన్ని సదుపాయాలూ సమకూర్చినా చదువులో రాణించలేదు. అతడొక మందబుద్ధిగా ఉపాధ్యాయులు భావించేవారు. తండ్రి వైద్యవిద్య కోసం ఎడింబరో విశ్వవిద్యాలయంలో చేర్చినా డార్విన్‌ కొనసాగించలేకపోయాడు. ఏదో ఒక డిగ్రీ సంపాదించాలనే తండ్రి కోరికపై కేంబ్రిడ్జ్‌లో తత్త్వశాస్త్ర అధ్యయనంలో చేరినా అక్కడా అంతే. అక్కడి ప్రొఫెసర్‌ ఓసారి అతడికి 'బీగల్‌' అనే ఓ నౌక కెప్టెన్‌కి పరిచయం చేశాడు. వివిధ దేశాల్లో, దీవుల్లో ఉండే జీవుల పరిశీలనకు అవకాశం ఉంటుందనే ఆలోచనతో డార్విన్‌ తన తండ్రి వద్దంటున్నా వినకుండా ఆ ఓడ ఎక్కేశాడు. ఆ నౌకాయానంలో డార్విన్‌ అనేక ప్రాంతాల్లో మొక్కలు, రాళ్లు, శిలాజాలు, కీటకాలు, జంతువులను పరిశీలించి చాలా నమూనాలను సేకరించి ఇంటికి పంపుతూ వచ్చాడు. ఆ పరిశీలనల ఆధారంగానే జీవజాతుల పరిణామ క్రమంపై పుస్తకం రాశాడు. 150 సంవత్సరాల క్రితం రాసిన ఈ గ్రంథం ఇప్పటికీ ప్రామాణికంగా నిలిచి ఉంది. జీవుల్ని ఏదో అతీత శక్తి ఏకకాలంలో సృష్టించలేదని, అవి వివిధ దశల్లో స్వాభావిక ఎంపిక (natural selection) ద్వారా పరిణామం చెందాయని డార్విన్‌ సిద్ధాంతం చెబుతుంది. ఇది ఇప్పటి మైక్రోబయాలజీ, జెనిటిక్స్‌, మాలిక్యులర్‌ బయాలజీలను సంఘటిత పరచడంలోనూ, డీఎన్‌ఏ పరీక్షల్లోనూ ప్రముఖ పాత్ర వహిస్తోంది.

*
డార్వినిజం.*
చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం (Darwin's theory of evolution) భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవ శాస్త్రంలో డార్వినిజం చాలా మార్పు తెచ్చింది. మూఢ నమ్మకాలని విభేదించడంలో కూడా డార్వినిజం కీలక పాత్ర పోషించింది. మనిషి కోతి నుంచి వచ్చాడు, మనిషిని దేవుడు సృష్ఠించలేదన్న సిద్దాంతాన్ని తెర మీదకు తెచ్చింది. ఇప్పుడు కూడా సృష్ఠివాదం పేరుతో డార్వినిజాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. డార్విన్ జీవ పరిణామ సిధ్ధాంతం మార్క్సిస్ట్ చారిత్రక భౌతికవాద రచనలకి కూడా ఊపిరిపోసింది. మలేషియా నుంచి రసెల్ వాలేస్ (1823- 1913) అనే వ్యక్తి పంపిన సిద్ధాంత వ్యాసం డార్విన్ వ్యాసం ఒకే విధంగా ఉన్నాయి. డార్విన్1844లో తన రచనను, వాలేస్ పంపిన వ్యాసాన్ని లియన్ సొసైటీ జర్నల్‌కు అందచేశాడు. 1858 జూలై 15న శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. ఇరువురి వ్యాసాలు పరిశీలించారు. 1844లో డార్విన్ మొదలు పెట్టగా, వాలేస్ 1858లో రాశాడు. కనుక డార్విన్ ముందు రాసినట్టు నిర్ధారించారు.

*
ప్రకృతి వరణ వాదము.*
_*1831
లో విజ్ఞాన శాస్త్ర పరిశోధనల నిమిత్తం యురోపియన్ దేశాలను చుట్టిరావటానికి బయలు దేరిన బీగల్ సముద్ర నౌకలో నేచురలిస్ట్ గా ప్రయాణం చేసే అవకాశం డార్విన్ కి లభించింది. ఈ అవకాశం ఆయన పాలిట సువర్ణావకాశమై గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణకు ఆధారభూతమైనది. అయిదేళ్ళపాటు కొనసాగిన యీ సముద్ర యానంలో డార్విన్ ఎన్నో రకాల ప్రదేశాలను, జంతువులను దర్శించాడు. ప్రకృతికి, జీవరాశికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఈ ఆలోచన ఫలితమే ప్రకృతి వరణ వాదముగా (నేచురల్ సెలక్షన్ థీరీ) గా పరిణమించింది.*_

*
వివరణ.*
ప్రస్తుతం ప్రపంచంలో కనబడుతున్న రకరకాల ప్రాణులు మొదటినుంచీ లేవనేది ఈ సిద్ధాంతం యొక్క ప్రధానమైన వాదన. కుక్కలూ, నక్కలూ, తోడేళ్ళూ ఒక జాతివనీ, పిల్లులూ, చిరతపులులూ, పెద్ద పులులూ, సింహాలూ మరొక జాతికి చెందినవనీ, గుర్రాలూ, గాడిదలూ, జీబ్రాలూ ఒకలాంటివే. గతంలో వీటికి తలొక "పూర్వీకుడూ" ఉండి ఉండాలి. ఇంకా వెనక్కెళితే ఈ "ఆదిమ" శునకానికీ, మార్జాలానికీ, అశ్వానికీ జన్మనిచ్చిన మరేదో మృగం ఉండి ఉంటుంది. ఇంకా ప్రాచీన యుగంలో ఈ క్షీరదాలకీ, తక్కిన చేపలూ, తాబేళ్ళూ, జలచరాలూ, పక్షులూ అన్నిటి ఆవిర్భావానికీ దారితీసిన ప్రాణి ఏదో ఉండే ఉంటుంది. వీటిలో కొన్ని శాకాహారులుగానూ, మరికొన్ని మాంసాహారులుగానూ రూపొందడానికి భౌతిక ప్రేరణలూ, పర్యావరణ పరిస్థితులే కారణాలు అయి ఉంటాయి. ఇన్నిరకాల ప్రాణులు "వాటంతట అవే" ఎలా ఉద్భవిస్తాయని వీరి వాదన సాగిపోతుంది.

ఉదాహరణకు ఆఫ్రికాలో పుట్టుకొచ్చిన మానవజాతి క్రమంగా ఉత్తరదిశగానూ, తక్కిన ప్రాంతాలకీ విస్తరించిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. ఉష్ణోగ్రత దృష్య్టా తొలిమానవులు నల్లని రంగులో ఉండి ఉంటారని అనుకోవచ్చు. ఉత్తరాన ఎండపొడ తక్కువగా పడే ప్రాంతాలకు వెళ్ళినవారి చర్మం తెల్లగా మారక తప్పలేదు. పూర్తిగా నల్లరంగులో ఉన్న ఒక మానవసమూహం తెల్లగా మారిపోవడానికి 20 వేల సంవత్సరాలు సరిపోతాయని అంచనా. తక్కిన జంతువుల సంగతి ఎలా ఉన్నా, ఒక్క మనిషిజాతినే తీసుకుంటే, చర్మం రంగూ, ముఖకవళికలూ అన్నీ కాస్తకాస్తగా మారడానికి జీవపరిణామ ప్రక్రియలే కారణమని రుజువు అవుతోంది. దీని కారణంగానే జీవపరిణామ సిద్ధాంతాన్ని కాదనేవారు ఎక్కువ సంఖ్యలో

*
పరిశోధనలు.*
సరిగ్గా ఈ సమయంలోనే ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ అనే మరో శాస్త్రవేత్త కూడా డార్విన్ చెప్పిన సిద్ధాంతాన్నే వెలువరించాడు. డార్విన్ కు ఉత్తరం కూడా రాసాడు. 1858 లో వీరిద్దరూ సంయుక్తంగా ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు కూడా! 1859 లో ప్రపంచ ప్రసిద్ధి పొందిన "ది ఆరిజన్ ఆఫ్ స్పీసిస్ ఆఫ్ నేచురల్ సెలక్షన్" పుస్తకాన్ని చార్లెస్ డార్విన్ వెలువరించాడు. ఈ పుస్తకం విడుదలైన రోజునె ఆన్ని ప్రతులూ అమ్ముడు పోయి సరికొత్త రికార్డును సృష్టించింది.

*
పరిణామ సిద్ధాంతం.*
జీవజాతుల మధ్య సంఘర్షణ ఉంటుంది. సజాతి సంఘర్షణ, విజాతి సంఘర్షణ, ప్రకృతిలో సంఘర్షణ. ఈ సంఘర్షణలో నెగ్గినవే ప్రకృతి ఎన్నిక చేసిన సార్థకమ జీవులు. ఇవే మనుగడను సాగిస్తాయి. ఈ జీవులలోని వైవిద్యాలే తరాలు మారుతూ పోగా కొత్త జాతుల ఉత్పన్నానికి మూలాధారాలు అవుతాయి. ఇది సంక్షిప్తంగా డార్విన్ పరిణామ వాదం.అయితే సృష్టి సిద్ధాంత వాదులు ఈయన వాదనను సమర్థించరు. అయితే బైబిల్ లో చెప్పినట్లు ఏడు రోజుల లోనే సమస్త సృష్టి, సకల జీవ జలాలు రూపొందించబడినాయని చెబితే మాత్రం నమ్మడం కష్టం.

*
ప్రశంశలు*
చార్లెస్ డార్విన్ స్వంత దేశమైన బ్రిటన్ లో డార్వినిజం ఎన్నో ప్రశంశలు అందుకుంది. డార్వినిజం ప్రపంచంలో ఎంతో మంది భౌతిక శాస్త్రవేత్తలని, జీవ శాస్త్రవేత్తలని ప్రభావితం చేసి అధునిక భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని ఎన్నో మలుపులు తిప్పింది.

*
విమర్శలు*
కొన్ని క్రైస్తవ, ఇస్లామిక్ దేశాలలో డార్వినిజం చాలా వివాదాస్పదమయ్యింది. సృష్ఠివాదాన్ని వ్యతిరేకించడం దైవ ద్రోహం అని మతవాదుల వాదన. కొన్ని ఇస్లామిక్ దేశాలలో ఇప్పటికే ఈ సిధ్ధాంతాన్ని నిషేదించారు. ఈ సిద్ధాంతం తప్పని, జీవ పరిణామక్రమం జరగలేదని వాదించేవారిలో టర్కీ దేశానికి చెందిన ఇస్లామిక్ రచయిత హారూన్ యహ్యా ఒకరు.

*
రచనలు*
1868
లో డార్విన్ "ది వారియేషన్ ఆఫ్ ఆనిమల్స్ అండ్ ప్లాంట్స్ అండర్ డొమెస్టికేషన్" అనే పుస్తకాన్ని ప్రచురించాడు. "ఇంసెక్టివోరస్ ప్లాంట్స్" "డీసెంట్ ఆఫ్ మ్యాన్", "ది ఫార్మేషన్ ఆఫ్ గజిటబుల్ మౌల్డ్ థ్రూ ది ఏక్షన్ ఆఫ్ వర్మ్స్" వంటి వి ఈయన రాసిన మరికొన్ని పుస్తకాలు.

*
అస్తమయం.*
ఈయన 74 యేండ్ల వయస్సులో చనిపోయారు. సర్ ఐజాక్ న్యూటన్ సమాధి దగ్గరే ఈయన కూడా సమాధి చేయబడటం కాక తాళీయం. డార్విన్ ఈనాడు లేకపోయినా ఆయన ప్రతిపాదించిన ప్రకృతివరన సిద్దాంతం నిలిచే ఉంటుంది.

నేను ప్రశ్నిస్తా ,మరలా మరలా ప్రశ్నిస్తా !

నేను ప్రశ్నిస్తా ,మరలా మరలా ప్రశ్నిస్తా !   ---(  సపోర్ట్  గౌరీ లంకేష్ ) 

నీమతఆచారం చెబుతుంది భర్త చని పొతే స్త్రీని సతీ సహగమనం(అంటే భర్త చితిపైనే బ్రతికున్న ఆమెను కూడా పడుకోబెట్టి కాల్చి చంపమని ). నీమతఆచారం చెబుతుంది చెపుతుంది భర్త చని పోయిన స్త్రీని గుండు గీఇంచి మూలన కూర్చుండ బెట్టమని.

నీ మతం చెపుతుంది భర్త చనిపొఇన స్త్రీని చచ్చేంత వరకు పునర్వివాహం చేసుకొనకుండా చచ్చేంత వరకు విధవగానే వుండాలని. నీమతంచెబుతుంది భర్త చనిపొఇన స్త్రీ ముఖం చూస్తే ఆశుభమని, అరిష్టమని.నీ మతం చెబుతుంది విధవరాలు శుభకార్యాలలో పాల్గొనటానికి అనర్హురాలని .

నీమతంచెబుతుంది మహిళ బహిస్ట్ ఐతే ఆమె మైల పడ్డదని ,ఆమెకు ఆ సమయంలో ఆలయాలలోకి ప్రవేశించే అర్హత లేదు అని . నీమతంచెబుతుంది స్త్రీ కన్యగా వున్నపుడు తండ్రి మీద ,యవ్వనంలో వున్నపుడు భర్త మీద ,ముసలి తనంలో కుమారుడి మీద మాత్రమే ఆధారపడి "బానిసలాగా" మాత్రమే స్త్రీ జీవించాలిగాని,స్వతంత్రంగా జీవించే హక్కు ఆమెకు ఎప్పటికి లేదని.

నీ మతం చెపుతుంది సాటి మనిషి చని పొతే ముట్టుకున్నా లేదా కనీసం చూసినా మైల పడతారని. నీమతంచెబుతుంది కుక్కను  దేవుడి  అవతారంగాను ,వేప చెట్టును ధనాన్ని ఇచ్చే దేవతగాను ,ఎలుకను దేవుడి వాహనంగాను,విష సర్పమైన పామును నాగదేవతగాను ,కుళ్ళిన జంతువుల కళేబరాలను తినే గ్రద్దను దేవుడి వాహనంగాను , చివరికి మలము తినే పందిని కూడా దేవుడిగాను పూజించమని, కాని ఆశ్చర్యంగా అదే.....

నీమతంచెపుతుంది దేవుడు మనుషులను మాత్రం నాలుగు వర్ణాలుగా పుట్టించ్చాడు అని , అందులో మొదటి వర్ణం వారు దేవుని మొఖము నుండి పుట్టారు అని , రెండవ వర్ణం వారు దేవుని భుజాలనుంది పుట్టారు అని ,మూడవ వర్ణం వారు దేవుడి తొడలనుండి పుట్టారు అని ,ఇక నాలుగవ వర్ణం వారు దేవుని యొక్క పాదాలనుండి పుట్టారు అని , అదే నీ మతం చెబుతుంది వారిలో నాలుగో వర్ణం వారు పై వర్ణాల వారికంటే తక్కువ వారు అని ,వారు పై వర్ణాల వారికి బానిసలు అని ,అదే నీ మతం చెబుతుంది వారికి దేవాలయ ప్రవేశం నిషిద్దమని అలాగే వేద చదువు నిషిద్దమని , వారు చదువుకుంటే నాలుక కోసేయ్యమని ,వేదాలు వింటే వారి చెవిలో సీసం కరిగించి పోయమని ,

నీ మతం చెబుతుంది నాలుగవ వర్ణం పురుషుడు పై వర్ణాల స్త్రీ లను (ప్రతిలోమ)వివాహం చేసుకుంటే ,అతడిని చెట్టుకు కట్టేసి చచ్చేవరకు కొరడాలతో కొట్టమని వారికి పుట్టిన సంతానం పంచములు అవుతారని ,వారు అంటరానివారు అని, కాని అదే నీ మతం శాషిస్తుంది పంచమవర్ణ స్త్రీలు మాత్రం జోగినులగా మారి మీ దేవుళ్ళకు ఉంపుడు గత్తెలుగా వుండాలని,వారితో (అగ్ర వర్ణ )ఊరిపెద్దలందరూ తమకామవాంచలు తీర్చుకొవచ్చని ,మిత్రమా అదే నీ మతం చెబుతుంది ఐదవవర్ణం(పంచములు) వారు ఊరి బయటే వుండాలని 

,అదే నీ మతం చెపుతుంది కుక్కలు , పశువులు , పక్షాదులైనా ఊరి చెరువులో నీరు త్రాగి ఆ చేరువులోనే అవి స్నానం చేసి వాటి మల ,మూత్రాలను విసర్జించ్చినా పరవాలేదుగాని సాటి మనిషి (అంటరానివారు) ఊరిచెరువులో నీరు త్రాగుట నిషిద్దమని,     మిత్రమా ....

నీవు కుక్కలను ,పశువులను ,పక్షులను పెంచుకుంటావు , ఎత్తుకుని ముద్దాడుతావు,వాటిని శుబ్రం చేస్తావు చివరకు పశువు మూత్రం కూడా పవిత్రమైనదని పాయసం లాగా త్రాగుతావే , సాటి మానవుడు అంటరాని వాడుగా నీకు ఎలా కనిపించాడు ,మిత్రమా ?”

నీ మతం మానవత్వానికే మచ్చ,నీ మతం మానవ హక్కులకే ఒక సవాల్ అటువంటి నీ మతంలో ఇన్ని లోపాలున్నా , నాకు ఇంతకష్టం ,ఇంత నష్టం కలిగించినా ,నన్ను దారుణంగా అవమానించినా ,... నీ మతాన్ని,నీ మతమౌడ్యాన్ని,నీ మత చాందసాన్ని నీవు ఏ మాత్రం సరిచేసుకోవు , సంస్కరించుకోవు , పైగా నీవు నాకు చెబుతావు.... ఈ దేశంలో పుట్టినందుకు నీ  మతాన్నే నేను  ఆచరిస్తూ చచ్చినట్టు జీవించ్చలనీ ?నీ మతానికే ఎప్పుడూ నేను బాజాలు కొడుతూ గౌరవించ్చాలని ? నీ మతాన్ని నేను ఎప్పుడూ పొగుడుతూ మీ అగ్రవర్ణాలకు ఎప్పటికి నేను బానిసగా ఉండాలని ? నీ మతాన్ని నేను ఎప్పుడు తిట్టకూడదు ,ప్రశ్నించ కూడదు ,విమర్శించ కూడదు అని ,..... కాని ఏ మాత్రం నీతి ,న్యాయం ,సమానత్వం,సిగ్గు  లేని నీ చెత్త మతాన్ని, నేను ప్రశ్నిస్తా , మరలా ,మరలా ,మరలా !  .

మత మూర్ఖపు పిరికిపందల చేతిలో నేలికొరిగిన "ధీరవనితకుమా వందనాల.
         గౌరీ లంకేష్ కు జోహార్లతో....

I N V I T A T I O N

The free Bi-Monthly (Feb,Apr,Jun,Aug,Oct,Dec) Medical Camp held for B.P., Sugar pationts at Sree Chakri Vidyanikhatan High school, Chakripuram cross Road, ECIL to Nagaram, Hyderabad. This camp is conducted on every 4th sunday of the month from Morning 7am to 10am. The consultation includes Sugar Test, BP Test, Doctor consultation and Medicines. Only Rs.100/- will be charged for one month medicines. All are Invited
JANAVIGNANA VEDIKA (Affiliated to AIPSN)