ప్రకృతి ఒడిలో సహజ వనరులను
ఉపయోగించుకుంటూ జీవితాలు గడిపిన సమాజం ఉన్నట్టుండి కాలుష్యకోరల్లో ఎలా చిక్కుకున్నది? రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన
తర్వాత ప్రపంచ యువనికపైకి పారిశ్రామిక విప్లవం పెద్ద ఎత్తున దూసు కొచ్చిన తర్వాత
కాలుష్యం రెక్క విప్పింది. పొగ గొట్టాలు, ఫాక్టరీ సైరన్లు అభి వృద్ధి చిహ్నాలుగా ముందు కొచ్చాయి.
పారిశ్రామికీకరణ ప్రపంచ ముఖ చిత్రాన్ని క్రమంగా మార్చివే సింది. ఈ క్రమం లో
పర్యావరణానికి తీరని హాని జరిగింది. చీడ పీడల నివారణ కు వాడే డీడీటీ వంటి పురుగు
మందులు ఆహార వలయంలో చేరి తల్లిపాలను కలుషితం చేసి జనారోగ్యాన్ని తీవ్రంగా
నష్టపరిచిన విషయాన్ని 1962లో రేచల్ కార్బన్ తన సైలెంట్ స్ప్రింగ్ గ్రంథంలో రుజువులతో సహా వివరించే వరకు
ప్రపంచం కాలుష్య ప్రమాదాల పట్ల దృష్టి సారించనే లేదు. నివారణకు తీసుకున్న చర్యలు
కూడా అంతంత మాత్రమే. భారతదేశం ఈ
ప్రమాదాన్ని గుర్తించటానికి మరో రెండు దశా బాలు పట్టింది. 1983లో భోపాల్ గ్యాస్ సృష్టించిన
మారణహోమం మ న దేశంలో పర్యావరణ స్పృహ కలిగించింది. దేశ వ్యాప్తంగా పర్యావరణ
ఉద్యమాలు రావటానికి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి దోహదం చేసిందీ ఘటన. నాటి
భోపాల్ దుర్ఘటన నుంచి నిన్నటి తూత్తుకుడి విషాదం వరకు దేశం నలుమూలల పర్యావరణం, జనారోగ్యం రెండూ బలవుతూనే
ఉన్నాయి. పరిశ్రమ లు నెలకొల్పటమే అభివృద్ధికి కొలమానంగా చూసి పారిశ్రామిక వేత్తలకు
ఎర్ర తివాచీలు పరుస్తున్నారు గానీ కలుగజేసే కోలుకోలేని హానిని గుర్తించడంలో
ప్రభుత్వాలు సీతకన్ను వేశాయి. పారిశ్రామిక
వ్యర్థాలు నదులను,
చెరువులను
కాలుష్య కాసారాలు చేస్తున్నా ప్ర భుత్వాలదీ, ప్రజలదీ ప్రేక్షక పాత్రే, జంట నగరాల మంచినీటి అవ సరాలు
తీర్చిన హుస్సేన్ సాగర్ జలాల్లోకి పారిశ్రామిక వాడల వ్యర్థాలు వచ్చి చేరుతుంటే
పాలకులకు పట్టిలేదు. ఇప్పుడు ఆ చెరువు ను ప్రక్షాళన చేయడానికి పథకాలు, ప్రయత్నాలు.. జరిగే పనేనా ఇది? హాస్యాస్పదంగా లేదూ! కానీ ఇది ఎవరో
కొందరి వ్యక్తుల తప్పిదం కాదు, మనం ఎంచుకున్న అభివృద్ధి నమూనాలోనే లోపం ఉందని ఎన్నటికి
గుర్తిస్తాం? ఇది లంచం చుట్టూ తిరుగుతుంది
తప్ప ప్రజా సంక్షేమం, పర్యావరణం
దానికి పట్టదు. పర్యావరణం దె బ్బతిని, భూతాపం పెరిగి వాతావరణం మొత్తంగా తీవ్ర మార్పులకు లోనై
భూగోళం యావత్తూ పెను ప్రమాదపు అంచుల్లో ఉంది. 1880 నుండి ఇప్పటి వరకు భూ ఉపరితల
ఉష్ణోగ్రత 1.8డిగ్రీలు పెరిగింది. భూ
తాపానికి ప్రధాన కారణమైన కార్బన్ డై ఆక్సైడ్ సూ చీ 407 పిపియాలను దాటుతోంది. దీంతో
మంచు పర్వతాలు కరిగి సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరిగి తీర ప్రాంత దేశాలనేకం ముంపు
ముంగిట బిక్కుబిక్కుమంటున్నాయి. దీన్ని నివారించాలం టే తక్షణం భూ తాపానికి కళ్లెం
వేయాలి. అందుకు కారణమైన హరిత వాయువుల విడుదలను నియంత్రించాలి. ప్రపంచ దేశాలన్నీ
ఒక్కటై ఐక్య రాజ్య సమితి నేతృత్వంలో ఇందుకో పకడ్బందీ పథకా న్ని తయారు చేశారు. కాని
సర్వ అనర్ధాలకు ఆధ్యుడైన అమెరికా మీ నమేషాలు లెక్కిస్తూ ఇటీవల ట్రంప్ నాయకత్వంలో ఆ
అంతర్జా తీయ ఒప్పందం నుండి వైదొలిగింది. అసలు వాతావరణ మార్పే బూటకం అని
బుకాయిస్తున్నది. 97
శాతానికి
పైగా వాతావరణ శాస్త్రజ్ఞులు శాస్త్రీయ ఆధారాలతో చూపించిన వాతావరణ మారును. సెనును
తపు బటడం శోచనీయం.
ప్లాస్టిక్ వాడకం విత్య జీవితం
లో ప్రతి ఒక్కరికీ అనివార్యమైంది. దీంతో ఎంతో ఉపయోగం, వెసులుబాటు ఉన్నప్పటికీ, ప్లాస్టిక్ వ్యర్థాలు
కలిగించిన ఆనర్థాలు పూచరణానికీ, మనిషితో సహా జీవజాతుల మనుగడకు నవ్వదా యకుగా పరిణమించాయి. భూ
వాతావరణం, ఇది వనరులు, నదుల నుండి సముద్రాల వరకు
ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి పోతున్నా యి. తినే ఆహారు, తాగే వీళ్లు నా అన్నీ
ప్లాస్టిక్ మయమే. ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి 500 బిలియన్ ప్లాస్టిక్ సంచులను
వాడుతున్నాం. సముద్రాల్లో చేరే వ్యర్థాలు 6 మిలియన్ టన్నులు. ప్రతి విమిషం పది లక్షలు ప్లాస్టిక్ పీసాలను
కొంటున్నాయి. వీటన్నిం టిలో ప్రమాదకరమైంది అతి పలుచని ఉల్లిపొరలో ఉండే పాలితీన్
సంచులు. ఇప్పటికైనా ఈ ఆనర్ధదాయక ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిచా రించకపోతే 2050 నాటికి ప్లాస్టిక్ వ్యర్థాల
సంఖ్యా చేవల్ని మించి పోతుంది. ఐక్య రాజ్య సమితి ప్రతి సంవత్సరం ఒక విషయాన్ని
ఎంపిక చేసి, దాన్ని ప్రచారులో పెట్టి
ప్రజలను ప్రభుత్వాలను అప్ర మత్తం చేయటం ఆనవాయితీ. గత ఏప్రిల్ 22న ధరిత్రి దినం సందర్భంగా
ప్లాస్టిక్ దుర్వి వియోగాన్నీ అంతమొందించేందుకు పిలుపునిచ్చింది. మళ్లీ పర్యావరణ
దీనం, జూన్ ఐదున కూడా ఇదే అం శాన్నీ
ప్లాస్టిక్ కాలుష్యా న్నీ అంత మొందిచమని ఐక్య రాజు సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎస్ ఈపే)
ప్రకటించింది. భారతదేశం వేదికగా ఈ సంవత్సరం పర్యావరణ కార్యక్రమాలను చేపట్టడం మరో
విశేషం. పర్యావరణాన్ని మనమెందుకు కాపాడాలి? అందు కోసం అభివృద్ధిని బలి చేయాలా? అనే వితండ వాద వలను అప్పుడపుడూ
వింటూ ఉంటాం. పర్యావరణ రక్షణ ఎవరి సైనో దయదలి వి చేసే పనికాదు. దానిలోనే మానవ
శ్రేయస్సు, ఆ మాటకొస్తే వకల జీవుల క్షేమం
దాగి ఉంది. మన చుట్టూ ఉన్న ప్రకృతి, వాతా వర Wం మన కోసమే లేదు. ఏ ఒక్కరి సొత్తూ రాదు. దాన్ని ననవరి చే
పార్కు ఎవరికీ లేదు. ప్రకృతి వనరులు ఇప్పటికే తీవ్ర వష్టానికి లోనయ్యాయి. ఈ
నష్టానికి నృప్తి పలకాలంటే సమగ్ర దృక్పథంతో పర్యావరణ పరిరక్షణ చేపట్టాలి. ప్రతి
ఒక్కరు పరాజరణయుతమైన ఒక మంచి పని రోజు చేస్తే మన భూగోశాన్ని పరీకుభ్రమైన హరిత
నిలయంగా మన భవిష్యత్ తరాలకు అందించగలం.
పో. కట్టా సత్యప్రాసాద్, సెల్ :
9490098918